Next Captain: ఈ ఇద్దరిలో టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియాకు కాబోయే సారథి ఎవరు?

రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసింది. బుధవారం టెస్ట్ ఫార్మాట్ నుంచి హిట్‌మన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందున్న అతిపెద్ద సవాల్. అయితే 33 ఏళ్ల వయస్సులో టెస్ట్‌ క్రికెట్ జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్.. నాలుగేళ్ల పాటు జట్టును కెప్టెన్‌గా బాధ్యతలు కొనసాగించాడు.

Next Captain: ఈ ఇద్దరిలో టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియాకు కాబోయే సారథి ఎవరు?
Test Captain

Updated on: May 08, 2025 | 7:34 AM

ఇక ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన సారథ్య స్థానాన్ని భర్తీ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఎంపిక ఇప్పుడు బీసీసీఐకి పెను సవాలుగా మారింది. అయితే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే భారత జట్టు తదుపరి కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకే బాధ్యతలు అప్పగిస్తారని గత కొన్ని రోజులుగా క్రికెట్‌ అభిమానుల్లో చర్చ నడుస్తుంది. కానీ కొన్ని గాయాల వల్ల బుమ్రా నాలుగు నెలల పాటు ఆటకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పట్లో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఇకపోతే భారత జట్టు కెప్టెన్సీ రేసులో మరో ప్లేయర్ పేరు కూడా వినిపిస్తోంది. అతనే యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్. గిల్‌ కూడా తన అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో తనదైన ముద్రవేసుకున్నాడు. జట్టును కీలక సందర్భాల్లో అద్భుత విజయాలను అందించాడు. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తనకిచ్చిన బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించాడు. జట్టును అతను నడిపించిన తీరు, జట్టు సభ్యులకు అతనిపై ఉన్న నమ్మకం, అతని కెప్టెన్సీపై గుజరాత్‌ యాజమాన్య ప్రశంసలు ఇవన్న అతని నాయకత్వ లక్షనాలకు నిదర్శనంగా నిలిచాయి. ఇక బీసీసీఐ కూడా గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు పలు సందర్భాల్లో స్పష్టమైంది. అయితే గిల్‌ ఎంపికకు ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. విదేశాల్లో అతని ఆట తీరు అతనికి కెప్టెన్సీ అవకాశాలను దూరం చేసేట్టు కనిపిస్తోంది. స్వదేశీ గడ్డపై గిల్‌ నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. విదేశాల్లో మాత్రం అతని ఆట తీరు ఆందోళకన కరంగా ఉంటుంది.

భారత్‌ తరపున ఇప్పటి వరకు 32 టెస్టులు ఆడిన గిల్‌ 1893 పరుగులు చేశాడు. 35 సగటుతో 5 సెంచరీలు చేసిన గిల్‌ జట్టులో తన స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. కానీ విదేశాల్లో ఆడిన మ్యాచ్‌లలో మాత్రం అంతగా రాణించలేక పోయాడు. విదేశాల్లో 13 టెస్ట్‌లు ఆడిన గిల్ కేవలం 649 పరుగులు మాత్రమే చేశాడు. ఇది అతని ఎంపిక అవకాశాలపై ప్రభావం చూపవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఇప్పటి వరకు టెస్ట్‌ క్రికెట్‌లో భారత్‌కు మూడు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా ఒక దానిలో విజయం సాధించి రెండింటిలో ఓటమి చవిచూశాడు. గాయం కారణంగా రోహిత్ దూరం కావడంతో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌కు తొలిసారి కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో సారధిగా వ్యవహరించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఇక సిడ్నీలో జరిగిన టెస్ట్‌కు రోహిత్ దూరం కావడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బుమ్రా..అదే మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఈ గాయం అతని కెప్టెన్సీ ఆశలను దూరం చేసింది.ఈ తరుణంలో భారత జట్టు కెప్టెన్‌ ఎంపిక బీసీసీఐకు తలనొప్పిగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..