
మరో రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్ 2021 లీగ్ స్టేజి పూర్తి కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. ముంబై ఇండియన్స్ ఈసారి రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే అని చెప్పాలి. ఒకవేళ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే.. ఆ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాల్సిందే.

10 విజయాలతో, 3 పరాజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9 విజయాలతో 5 పరాజయాలతో 18 పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు 16 పాయింట్స్, కోల్‌కతా 14 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

నేటి మ్యాచ్‌లు: సన్‌రైజర్స్ హైదరాబాద్ వెర్సస్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్

ఆరెంజ్ క్యాప్: కెఎల్ రాహుల్(626) అగ్రస్థానంలో.. డుప్లెసిస్(546) రెండో స్థానంలో.. రుతురాజ్ గైక్వాడ్(533), శిఖర్ ధావన్(501), సంజూ శాంసన్(484)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(29 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(22 వికెట్లు) రెండు, జస్ప్రిత్ బుమ్రా(19 వికెట్లు), షమీ(19 వికెట్లు), ఆర్షదీప్ సింగ్(18 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

IPL 2022