CSK IPL 2021 auction: ఈసారి ఐపీఎల్‌లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్‌కే..’ల్యాండ్ ఆఫ్ బాహుబలి’ అంటూ

|

Feb 19, 2021 | 12:50 PM

ఈసారి ఐపీఎల్ వేలంలో  కడప కుర్రాడు సత్తా చాటాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నె సూపర్‌కింగ్స్ జట్టులో చేరాడు. . చిన్నమండెం మండలం బోనమల గ్రామ సమీపంలోని....

CSK IPL 2021 auction: ఈసారి ఐపీఎల్‌లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్‌కే..ల్యాండ్ ఆఫ్ బాహుబలి అంటూ
Follow us on

CSK IPL 2021 auction:  ఈసారి ఐపీఎల్ వేలంలో  కడప కుర్రాడు సత్తా చాటాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నె సూపర్‌కింగ్స్ జట్టులో చేరాడు. . చిన్నమండెం మండలం బోనమల గ్రామ సమీపంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెట్‌ ప్లేయర్ హరిశంకరరెడ్డిని చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్‌లో  నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో సీఎస్‌కే జట్టు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. డిగ్రీ వరకు చదువుకున్న ఇతడు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అండర్‌-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడాడు. అనంతరం రంజీ టీమ్‌కు కూడా సెలక్టయ్యాడు. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ అయిన హరిశంకర్ రెడ్డికి తొలివిడత మినీ ఐపీఎల్ వేలం పాటలోనే సత్తా చాటి.. తన ప్రతిభ ప్రూవ్ చేసకున్నాడు.

2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు సెలక్ట్ కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ పోటీల్లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆకాంక్షించారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే  ధోనీ జట్టులో చోటు దక్కడం అతడి లక్ అని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. కాగా హరిశంకర్ రెడ్డి జట్టులోకి ఎంట్రీకి సంబంధించి  ‘ల్యాండ్ ఆఫ్ బాహుబలి నుంచి ఒకరిని జట్టులోకి తీసుకున్నాం’. అంటూ సీఎస్‌‌కే ట్వీట్ చేసింది.

Also Read:

చెన్నై కాదు పొమ్మంది.. కోల్‌కతా కావాలి రమ్మంది.. రెండు కోట్ల ధర పలికిన టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్..

అర్జున్ టెండూల్కర్ టాలెంట్‌ను ముందే ఊహించారా..! ముంబయి టీమ్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ ఏం చెప్పాడంటే..