AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : కానిస్టేబుల్ ఉద్యోగం వద్దనుకుని క్రికెటర్ అయ్యాడు.. మరి ఈ రోజు వైభవ్ సిక్సర్ల సునామీకి బ్రేకులు వేస్తాడా?

IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగబోయే 32వ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు ఇద్దరు యువ సంచలనాల మీద ఉన్నాయి. ఒకరు రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ల వీరుడు వైభవ్ సూర్యవంశీ, మరొకరు లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్ గన్ ప్రిన్స్ యాదవ్.

IPL 2026 : కానిస్టేబుల్ ఉద్యోగం వద్దనుకుని క్రికెటర్ అయ్యాడు.. మరి ఈ రోజు వైభవ్ సిక్సర్ల సునామీకి బ్రేకులు వేస్తాడా?
Vaibhav Suryavanshi Vs Prince Yadav
Rakesh
|

Updated on: Apr 22, 2026 | 2:44 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో కుర్రాళ్ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగబోయే 32వ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు ఇద్దరు యువ సంచలనాల మీద ఉన్నాయి. ఒకరు రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ల వీరుడు వైభవ్ సూర్యవంశీ, మరొకరు లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్ గన్ ప్రిన్స్ యాదవ్. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. బుమ్రా, బౌల్ట్ వంటి దిగ్గజ బౌలర్లనే చీల్చిచెండాడిన ఈ కుర్రాడు, తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటికే 44 సిక్సర్లు బాదాడు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతినే సిక్సర్‌గా మలచడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. ఏ బౌలర్ వచ్చినా తగ్గేదేలే అంటూ విరుచుకుపడుతున్న వైభవ్‌కు ఇప్పుడు ప్రిన్స్ యాదవ్ రూపంలో ఒక పెద్ద సవాల్ ఎదురుకానుంది.

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ప్రిన్స్ యాదవ్ కథ సినిమాను తలపిస్తుంది. ఇతడి తండ్రి రైల్వే పోలీసులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. తన కొడుకును కానిస్టేబుల్ పరీక్ష రాయమని తండ్రి చెబితే.. తన మీద నమ్మకంతో క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు ప్రిన్స్. అయితే వయస్సు వివాదంలో చిక్కుకుని రెండేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే కష్టపడి తన వేగాన్ని, స్వింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. నిషేధం ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026లో తన ప్రతాపం చూపిస్తున్నాడు.

సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ సైతం ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌కు ఫిదా అయ్యాడు. ఈ సీజన్ ఆడుతున్న అన్‌క్యాప్డ్ బౌలర్లందరిలోనూ ప్రిన్స్ యాదవ్ అత్యంత అత్యుత్తమ బౌలర్ అని, అతడిని నంబర్ వన్ స్థానంలో ఉంచాడు స్టెయిన్. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన ప్రిన్స్, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఒకవైపు సిక్సర్ల వీరుడు వైభవ్, మరోవైపు వేగంతో వికెట్లు పడగొట్టే ప్రిన్స్ యాదవ్. లక్నో, రాజస్థాన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు ఎంతో ఉత్కంఠను రేపుతోంది. ప్రిన్స్ తన పదునైన యార్కర్లతో వైభవ్‌ను ఇబ్బంది పెడతాడా? లేక వైభవ్ తన ట్రేడ్‌మార్క్ సిక్సర్లతో ప్రిన్స్‌ను చితక్కొడతాడా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తే ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో