Vaibhav Suryavanshi : లగ్జరీ కార్లు, ముంబైలో ఖరీదైన ఫ్లాట్.. 15 ఏళ్ల వయసుకే అన్ని కోట్ల ఆస్తులా..?
Vaibhav Suryavanshi : కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే బౌలర్లను వణికిస్తున్న ఈ బిహార్ సంచలనం.. సంపాదనలోనూ సీనియర్ స్టార్ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఈ చిన్నారి సాధించిన ఆర్థిక ఎదుగుదల, అతని లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో తన సిక్సర్ల సునామీతో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. మైదానంలో కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే బౌలర్లను వణికిస్తున్న ఈ బిహార్ సంచలనం.. సంపాదనలోనూ సీనియర్ స్టార్ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఈ చిన్నారి సాధించిన ఆర్థిక ఎదుగుదల, అతని లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.1.10 కోట్ల భారీ వార్షిక వేతనంతో రిటైన్ చేసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుల లిస్టులోకి చేరిన వైభవ్‌కు.. ఐపీఎల్‌లో ఆడే ఒక్కో మ్యాచ్‌కు అదనంగా రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. దీనికి తోడు అండర్-19 మ్యాచ్‌లు, డొమెస్టిక్ టోర్నమెంట్ల ద్వారా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
ఒకప్పుడు సరైన వసతులు లేక బిహార్‌లోని తాజ్‌పూర్‌లో ఉన్న తమ రూ.40 లక్షల విలువైన పాత ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలోనే వైభవ్ క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. కొడుకు ట్రైనింగ్ కోసం తండ్రి తన భూమిని కూడా అమ్మేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైభవ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తన ప్రొఫెషనల్ కెరీర్ కోసం ముంబైలోని ఒక అత్యంత ప్రీమియం ఏరియాలో రూ.3 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి ఫ్యామిలీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 ఏళ్లు కావడంతో అతనికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అర్హత లేదు. కానీ అతని గ్యారేజీలో మాత్రం అత్యంత విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. వైభవ్ అసాధారణ ఆటతీరుకు ఫిదా అయిన రాజస్థాన్ రాయల్స్ మాజీ ఓనర్ ఒకరు అతనికి ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కానుకగా ఇచ్చారు. అంతేకాదు, గత ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసినందుకు గాను అతను టాటా కర్వ్ ఈవీ కారును కూడా బహుమతిగా గెలుచుకున్నాడు.
ఇటీవల ముగిసిన 2026 అండర్-19 ప్రపంచకప్ (U-19 WC)లో వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున రికార్డు బద్దలు కొట్టే ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శనకు, దేశానికి తెచ్చిన కీర్తికి గుర్తింపుగా బిహార్ రాష్ట్ర ప్రభుత్వం వైభవ్‌కు రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించింది. ప్రస్తుతం బడా బ్రాండ్లు సైతం (ఉదాహరణకు కాంప్లాన్) ఈ కుర్రాడిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నాయి. తండ్రి పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ చిన్నారి ఇప్పుడు రూ.5 నుంచి 7 కోట్ల నికర ఆస్తితో దేశంలోనే అత్యంత సంపన్న యువ అథ్లెట్లలో ఒకడిగా దూసుకుపోతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
