AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: హార్దిక్ చాప్టర్ క్లోజ్.. ముంబై ఇండియన్స్‌లో విస్ఫోటనం.. రోహిత్ శర్మ చేతుల్లోకి కీలక పవర్..!

IPL 2026: ఐపీఎల్ 2026 వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్‌ను వదిలి వెళ్లాలని హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నారు. రోహిత్ శర్మ ఆశీస్సులతోనే కొత్త కెప్టెన్ ఎంపిక జరగనుంది. రోహిత్ శర్మ ఎవరికైతే ఆశీస్సులు అందిస్తాడో.. అతని తల పైనే ముంబై కిరీటం పెట్టాలని ఓనర్లు ఫిక్స్ అయ్యారు.

IPL 2026: హార్దిక్ చాప్టర్ క్లోజ్.. ముంబై ఇండియన్స్‌లో విస్ఫోటనం.. రోహిత్ శర్మ చేతుల్లోకి కీలక పవర్..!
Mi Rohit
Rakesh
|

Updated on: May 29, 2026 | 12:46 PM

Share

IPL 2026: ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో మునుపెన్నడూ చూడని రీతిలో ముసలం పుట్టింది. కేవలం కెప్టెన్సీ మార్పు మాత్రమే కాదు.. ఏకంగా జట్టు మనుగడనే ప్రశ్నార్థకం చేసే రేంజ్‌లో లోపల అంతర్గత యుద్ధం నడుస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే ముంబై క్యాంప్‌లో గుసగుసలు కాస్తా ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీశాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కేవలం వేటు వేయడమే కాదు.. యాజమాన్యంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అతను ఫ్రాంచైజీని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే తరుణంలో జట్టు తదుపరి బాస్ ఎవరనే దానిపై ముంబై మేనేజ్‌మెంట్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్.. గతంలో తాము చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటో ఎట్టకేలకు తెలుసుకుంది. 2023 ముగిశాక రోహిత్ శర్మను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించి, హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇవ్వడం ఎంత పెద్ద తప్పో యాజమాన్యానికి ఇప్పుడు బాగా అర్ధమైంది. అందుకే ఈసారి ఎలాంటి గొడవలు, ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే.. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్‌ను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను, పవర్‌ను రోహిత్ శర్మకే అప్పగించింది. రోహిత్ శర్మ ఎవరికైతే ఆశీస్సులు అందిస్తాడో.. అతని తల పైనే ముంబై కిరీటం పెట్టాలని ఓనర్లు ఫిక్స్ అయ్యారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అభిమానులందరిలో ఒకటే ప్రశ్న.. అయితే రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ సీట్లోకి కూర్చుంటాడా? కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. రోహిత్ శర్మ కొత్త కెప్టెన్‌ను డిసైడ్ చేస్తాడే తప్ప, తను మాత్రం మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనని స్పష్టం చేసినట్లు టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత టాప్ కోచ్ ఒకరు వెల్లడించారు. “ముంబై యాజమాన్యం తాము చేసిన తప్పును గ్రహించింది. కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ నిర్ణయమే ఫైనల్. కానీ రోహిత్ మళ్లీ వెనక్కి వెళ్లి ఆ ముళ్ల కిరీటాన్ని ధరించడు” అని ఆ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో ఒక నార్మల్ ప్లేయర్‌గా కూడా కొనసాగే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు. ముంబై ఓనర్లతో, మేనేజ్‌మెంట్‌తో హార్దిక్‌కు సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. “హార్దిక్ పాండ్యా స్వయంగా వేరే ఫ్రాంచైజీకి ట్రాన్స్‌ఫర్ కోరుకుంటున్నాడు. ఇది కేవలం కెప్టెన్సీ పోయిందనే ఈగో మాత్రమే కాదు.. వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం. ఒక కంపెనీ యాజమాన్యంతో సత్సంబంధాలు లేనప్పుడు ఏ ఉద్యోగి కూడా అక్కడ మనశ్శాంతిగా పని చేయలేడు.. హార్దిక్ పరిస్థితి కూడా ఇప్పుడు అదే” అని ఇన్‌సైడర్స్ పేర్కొంటున్నారు.

గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబైకి తెచ్చుకున్నప్పుడే.. ఆ జట్టు సక్సెస్ ఫుల్ కోచ్ ఆశిష్ నెహ్రాను కూడా ముంబైలోకి లాగేయాల్సింది కదా అనే ప్రశ్నలపై సదరు క్రికెట్ నిపుణుడు స్పందించారు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ నుంచి కోచ్‌ను, కెప్టెన్‌ను ఒకేసారి లాక్కోవడం అంత సులభం కాదని.. నెహ్రా గుజరాత్‌ను వదిలి ముంబైకి ఎందుకు వస్తాడని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ, హార్దిక్ పాండ్యా భవిష్యత్తు, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై రాబోయే రెండు వారాల్లో ఒక అధికారికమైన, స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు