IPL 2026 Playoffs: 3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. ఆ 2 ప్లేస్‌ల కోసం 5 జట్ల మధ్య కీలక పోరు..!

IPL 2026 Playoffs Qualification Scenario: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. 52 మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలవ్వడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్లేఆఫ్స్ కోసం జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది.

IPL 2026 Playoffs: 3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. ఆ 2 ప్లేస్‌ల కోసం 5 జట్ల మధ్య కీలక పోరు..!
Bcci Warning To Ipl Teams
Image Credit source: X.com

Updated on: May 10, 2026 | 3:33 PM

IPL 2026 Playoffs Qualification Scenario: ప్రస్తుత గణాంకాల ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించాయి. ఈ మూడు జట్లు తమ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించినా గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే సాధించగలవు. లీగ్ దశ ముగిసే సమయానికి 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమనే చెప్పాలి. అధికారికంగా ఈ జట్లు ఇంకా రేసులో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ముందడుగు వేయడం కష్టం.

క్వాలిఫైకి చేరువలో హైదరాబాద్, గుజరాత్..

సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు తలా 11 మ్యాచ్‌లు ఆడి ఏడేసి విజయాలతో 14 పాయింట్లు సాధించాయి. ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవడానికి వీరికి మరో ఒక్క విజయం మాత్రమే అవసరం. అయితే, ఫైనల్‌కు వెళ్లేందుకు రెండు అవకాశాలు ఉండాలంటే ఈ జట్లు మొదటి రెండు స్థానాల్లోనే లీగ్ దశను ముగించాలని పట్టుదలతో ఉన్నాయి.

రెండు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోరాటం..

అసలు సిసలైన పోరు ఇప్పుడు మొదలైంది. పట్టికలో మిగిలిన రెండు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు: ఈ జట్లు సీజన్ ఆరంభంలో అద్భుతంగా రాణించినప్పటికీ, ద్వితీయార్థంలో తడబడ్డాయి.

చెన్నై, కోల్‌కతా: మొదట్లో పరాజయాలు ఎదురైనా, కీలక సమయంలో పుంజుకుని టాప్-4 రేసులో నిలిచాయి.

నెట్ రన్ రేట్ కీలకం కానుందా?

వచ్చే కొన్ని మ్యాచ్‌ల్లో ఈ ఐదు జట్లు తలపడనున్నాయి. జట్ల పాయింట్లు సమానమైన పక్షంలో ‘నెట్ రన్ రేట్’ ప్లేఆఫ్స్ అదృష్టాన్ని నిర్ణయించనుంది. ప్రతి విజయం, ఓటమి ఆధిక్యం ఇప్పుడు జట్ల భవిష్యత్తును మార్చగలవు. కోట్లాది మంది అభిమానులు తమ అభిమాన జట్టు టాప్-4 లో నిలవాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us