IPL 2026 Playoffs: ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు చూస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే..?

IPL 2026 Playoff Scenarios: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం 3 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా అవి గరిష్టంగా 12 పాయింట్లకు మాత్రమే చేరుకోగలవు. ఇది ప్లేఆఫ్స్ అర్హతకు సరిపోదు.

IPL 2026 Playoffs: ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు చూస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే..?
Bcci Warning To Ipl Teams
Image Credit source: X.com

Updated on: May 11, 2026 | 7:48 PM

IPL 2026 Playoff Scenarios: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ పోరు మరింత రసవత్తరంగా మారింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరాటాల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఈ ఫలితాల తర్వాత పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే రెండు జట్లు అధికారికంగా నిష్క్రమించగా, మరో నాలుగు జట్ల ప్రయాణం క్లిష్టంగా మారింది.

ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై, లక్నో ఔట్..

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం 3 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా అవి గరిష్టంగా 12 పాయింట్లకు మాత్రమే చేరుకోగలవు. ఇది ప్లేఆఫ్స్ అర్హతకు సరిపోదు.

ప్రమాదంలో ఉన్న ఆ 4 జట్లు ఇవే..!

ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 నుంచి 16 పాయింట్లు అవసరం. ఈ నేపథ్యంలో కొన్ని జట్ల పరిస్థితి ఇలా ఉంది:

ఢిల్లీ క్యాపిటల్స్: మిగిలిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే వీరికి అవకాశం ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే.

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్: ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న ఈ రెండు జట్లకు 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్కటి ఓడినా వీరి ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): కేకేఆర్ పరిస్థితి ఇంకా కఠినంగా ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి.

టాప్-4 రేసులో దూసుకుపోతున్న జట్లు..

ప్రస్తుత ఫామ్, పాయింట్ల ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ రేసులో ముందున్నాయి.

RCB: అత్యుత్తమ నెట్ రన్ రేట్‌తో టేబుల్ టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్: ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్, మిగిలిన 4 మ్యాచ్‌లు గెలిస్తే 21 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

SRH, GT: ఈ రెండు జట్లు కూడా టాప్-4 లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us