IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే

IPL 2026 Finishers : ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ ఫలితాన్ని చివరి ఓవర్లలోనే తేల్చే వాళ్లే ఫినిషర్లు. ముంబై ఇండియన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ, కేకేఆర్ వరకు పది జట్లలో ఉన్న మొత్తం 31 మంది ఫినిషర్ల బలాలు, బలహీనతలు, స్ట్రైక్ రేట్లు, కీలక రికార్డులు, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం గురించి డీటైల్‌గా తెలుసుకుందాం.

IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
Ipl 2026 Finishers

Updated on: Mar 21, 2026 | 1:51 PM

IPL 2026 Finishers : ఐపీఎల్ అంటేనే ఆఖరి ఓవర్ వరకు సాగే ఉత్కంఠ. ఆ ఉత్కంఠలో జట్టును గెలిపించే వాడే అసలైన ఫినిషర్. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ ఫినిషర్లపైనే ఉంది. ఈసారి పది జట్లలో కలిపి మొత్తం 31 మంది మేటి ఫినిషర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ జట్టు దగ్గర ఏ రేంజ్ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారో, ఏ టీమ్ ఫినిషింగ్ టచ్ అదిరిపోతుందో వివరంగా చూద్దాం.

1. ముంబై ఇండియన్స్ (MI)

హార్దిక్ పాండ్యా: ముంబై కెప్టెన్, అసలైన ఆల్‌రౌండర్. ఒత్తిడిలో సిక్సర్లు కొట్టడంలో ఇతను దిట్ట. డెత్ ఓవర్లలో హార్దిక్ స్ట్రైక్ రేట్ 170+ ఉండటం ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తుంది.

నమన్ ధీర్: గత సీజన్‌లోనే తన పవర్‌ను చూపించాడు. తక్కువ బంతుల్లోనే గేమ్‌ను మార్చగల సత్తా ఇతని సొంతం.

విల్ జాక్స్: అంతర్జాతీయ టీ20ల్లో మెరుపు సెంచరీలు బాదిన రికార్డు ఇతనికుంది. స్పిన్, పేస్ అన్న తేడా లేకుండా ఊచకోత కోయగలడు.

2. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఎంఎస్ ధోనీ: ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఫినిషర్. 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటికీ తలా పేరుమీదే ఉంది. 44 ఏళ్ల వయసులోనూ హెలికాప్టర్ షాట్లతో హోరెత్తించగలడు.

శివం దూబే: స్పిన్ బౌలర్ల పాలిట యముడు. చిన్న చిన్న గ్రౌండ్లలో దూబే కొట్టే సిక్సర్లు స్టేడియం దాటాల్సిందే.

కార్తీక్ శర్మ: డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఈసారి సీఎస్‌కే ఫినిషింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

డెవాల్డ్ బ్రెవిస్: బేబీ ఏబీగా పేరుగాంచిన ఇతను, ఏబీ డివిలియర్స్ తరహాలో 360 డిగ్రీల షాట్లు ఆడటంలో రికార్డు సృష్టించాడు.

3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

టిమ్ డేవిడ్: ప్రపంచవ్యాప్త లీగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదే ఆటగాళ్లలో ఒకడు. కేవలం ఫినిషర్‌గానే ఆర్‌సీబీ ఇతనిపై భారీ పెట్టుబడి పెట్టింది.

జితేష్ శర్మ: క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడటం ఇతని స్పెషాలిటీ. వికెట్ కీపర్ ఫినిషర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

రొమారియో షెపర్డ్: కరీబియన్ పవర్ అంటే ఏంటో చూపిస్తాడు. డెత్ ఓవర్లలో ఒకే ఓవర్లో 30కి పైగా పరుగులు రాబట్టగల సత్తా ఇతనికుంది.

4. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

డేవిడ్ మిల్లర్: మిల్లర్ ది కిల్లర్‎గా ప్రసిద్ధి. ఒత్తిడి ఎంత ఉన్నా కూల్‌గా ఉంటూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో ఇతను మొనగాడు.

సమీర్ రిజ్వీ: టీ20ల్లో తక్కువ వయసులోనే కోట్లు పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారీ షాట్లు ఆడటంలో ఇతను నెరవేర్చని టార్గెట్ అంటూ లేదు.

అశుతోష్ శర్మ: గతేడాది తక్కువ బంతుల్లోనే అత్యధిక సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరి వరుసలో వచ్చి మెరుపులు మెరిపించడంలో ఇతను సిద్ధహస్తుడు.

5. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

హెన్రిక్ క్లాసెన్: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్ బాల్ బ్యాటర్. స్పిన్నర్లపై ఇతను చేసే దాడి ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డు.

లియామ్ లివింగ్‌స్టన్: ఐపీఎల్ చరిత్రలో అత్యంత పొడవైన సిక్సర్ (117 మీటర్లు) బాదిన రికార్డు ఇతని పేరు మీద ఉంది. ఏ స్థానంలోనైనా విధ్వంసం సృష్టించగలడు.

అనికేత్ వర్మ: దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి ఎస్‌ఆర్‌హెచ్ నమ్మకాన్ని గెలుచుకున్న యువ ఫినిషర్.

6. గుజరాత్ టైటాన్స్ (GT)

రాహుల్ తెవాటియా: ఆఖరి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఏకైక ఆటగాడు. మిరాకిల్ ఫినిషర్‎గా తెవాటియాకు ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డు ఉంది.

జేసన్ హోల్డర్: తన ఎత్తును వాడుకుంటూ బంతిని బాదడంలో, చివర్లో వికెట్లు తీయడంలో హోల్డర్ దిట్ట.

గ్లెన్ ఫిలిప్స్: అసాధ్యమైన షాట్లను సులభంగా ఆడే ఆటగాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తూ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాడు.

7. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

నికోలస్ పూరన్: టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన కరీబియన్ వీరుల్లో ఇతను ఒకడు. ఏ మాత్రం కనికరం లేకుండా బౌలర్లపై విరుచుకుపడతాడు.

ఆయుష్ బదోని: లక్నో టీమ్‌లో ‘లోకల్ ఫినిషర్’. 360 డిగ్రీల షాట్లతో మైదానం నలుమూలలా బంతిని పంపగలడు.

అబ్దుల్ సమద్: జమ్మూ ఎక్స్‌ప్రెస్. పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ చివర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడు.

8. రాజస్థాన్ రాయల్స్ (RR)

షిమ్రాన్ హెట్మెయర్: డెత్ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లలో ఒకడు. గ్రీన్ హెయిర్ స్టైల్ లాగే ఇతని బ్యాటింగ్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది.

शुभమ్ దూబే: భారీ ధరతో రాజస్థాన్ జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు. ఫినిషర్‌గా తనని తాను నిరూపించుకోవడానికి ఈ సీజన్ ఇతనికి కీలకం.

డోనోవన్ ఫెరీరా: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మెరుపు బ్యాటర్. బంతిని క్లీన్‌గా హిట్ చేయడంలో ఇతని రికార్డు బాగుంది.

9. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

రింకూ సింగ్: 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి అసాధ్యమైన విజయాన్ని అందించిన ఏకైక వీరుడు. రస్సెల్ లేని లోటును తన ఒంటిచేత్తో భర్తీ చేయగల సమర్థుడు.

రమణ్‌దీప్ సింగ్: గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో చివర్లో ఇతను ఆడిన ఇన్నింగ్స్‌లు చాలా కీలకం. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉంటాడు.

రికార్డో పావెల్: విండీస్ నుంచి వచ్చిన ఈ భారీ కాయుడు బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలో సిద్ధహస్తుడు.

10. పంజాబ్ కింగ్స్ (PBKS)

శశాంక్ సింగ్: గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్ తరపున అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఒత్తిడిలో నిలబడటం ఇతని నైజం.

మార్కస్ స్టోయినిస్: ఆస్ట్రేలియా పవర్ హిట్టర్. సెంచరీలతో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన రికార్డు ఇతనికుంది.

మార్కో జాన్సెన్: కేవలం బౌలర్ మాత్రమే కాదు, బ్యాట్‌తోనూ ఆఖరి ఓవర్లలో భారీ సిక్సర్లు బాదగల ఆల్‌రౌండర్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us