IPL 2024: హైదరాబాద్ జట్టుకు భారీషాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్..!

|

Mar 31, 2024 | 5:00 PM

IPL 2024: IPL 17వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. IPL 2024 వేలానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి వనిందు హసరంగాను విడుదల చేసింది. ఆ తర్వాత, హసరంగాను వేలంలో సన్‌రైజర్స్ అతని అసలు ధర రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు 2022లో RCB హసరంగాను రూ.10.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

1 / 6
ఐపీఎల్ 17వ ఎడిషన్‌ను అట్టహాసంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా మొత్తం లీగ్‌కు దూరమయ్యాడు.

2 / 6
వాస్తవానికి గత ఎడిషన్ వరకు ఆర్‌సీబీ తరపున ఆడిన హసరంగాను ఈసారి జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. కానీ ఇతర కారణాల వల్ల హసరంగ ఇక హైదరాబాద్ జట్టులో చేరలేదు.

3 / 6
మునుపటి నివేదికల ప్రకారం, మడమ గాయం కారణంగా హసరంగా ఈ సీజన్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే సీజన్ ద్వితీయార్థంలో పిచ్‌లు నెమ్మదించే అవకాశం ఉంది. ఆ సమయంలో, హసరంగా జట్టుకు X ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది.

4 / 6
హసరంగా తన ఎడమ చీలమండ గాయానికి సంబంధించిన చెక్-అప్ కోసం మార్చి 31న విదేశాలకు వెళతాడని, హసరంగా అందుబాటులో లేకపోవడం గురించి అతని మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణుల సలహా మేరకు ఐపీఎల్ జట్టులో చేరడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

5 / 6
పైన చెప్పినట్లుగా, IPL 2024 వేలానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి వనిందు హసరంగాను విడుదల చేసింది. ఆ తర్వాత, హసరంగాను వేలంలో సన్‌రైజర్స్ అతని అసలు ధర రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు 2022లో RCB హసరంగాను రూ.10.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

6 / 6
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, ట్రావిస్ హెడ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, జె సుబ్రమణియన్.