Sunrisers Hyderabad vs Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 (IPL) 18వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హైదరాబాద్లో జరుగుతోంది. శుక్రవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్కు 166 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
13 పరుగుల వద్ద డారిల్ మిచెల్, 35 పరుగుల వద్ద అజింక్య రహానే, శివమ్ దూబే 45 పరుగుల వద్ద, రితురాజ్ గైక్వాడ్ 26 పరుగుల వద్ద, రచిన్ రవీంద్ర 12 పరుగుల వద్ద ఔటయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, షాబాజ్, పాట్ కమిన్స్, నటరాజన్, జయదేవ్ తలో వికెట్ తీశారు.