
గాయం నుంచి కోలుకుని తిరిగి బరిలోకి దిగడం, అద్భుత ప్రదర్శన కనబరచడం.. ఏ ప్లేయర్‌కు అంత ఈజీ కాదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ చాలా సింపుల్‌గా తన రీ-ఎంట్రీను గ్రాండ్ స్టైల్‌లో చూపించాడు. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన కుల్దీప్.. శుక్రవారం లక్నోతో మ్యాచ్ అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన స్పిన్ మాయాజాలంతో తొలి ఓవర్‌లోనే లక్నో జట్టులోని కీలకమైన ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో ఆ జట్టు బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్‌ను అవుట్ చేశాడు.
8వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ ధాటికి లక్నో జట్టు విలవిలలాడిపోయింది. ఈ ఓవర్ మూడో బంతికి మార్కస్ స్టోయినిస్‌ను ట్రాప్ చేసిన కుల్దీప్.. ఆ వెంటనే నికోలస్ పూరన్‌ను ఫస్ట్ బంతికే బౌల్డ్ చేశాడు. పూరన్‌ను గోల్డ్ డకౌట్ చేసిన గూగ్లీకి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పూరన్, స్టోయినిస్‌లతోనే కుల్దీప్ ఆగలేదు.. ఆ తర్వాతి ఓవర్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కూడా పడగొట్టాడు. కుల్దీప్ వేసిన వేగవంతమైన బంతిని కట్ చేసేందుకు రాహుల్ ప్రయత్నించగా, బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ పంత్ చేతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ కేవలం 9 బంతుల్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు ఢిల్లీ.. టోర్నమెంట్‌లో తన రెండో విజయం అందుకుంది.
𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍
Kuldeep Yadav straight away unveiling his magic!👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA
— IndianPremierLeague (@IPL) April 12, 2024