13 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. కట్ చేస్తే.. కోహ్లీ రికార్డు తునాతునకలు..!

జోస్ ది బాస్.. ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీంను.. తన సూపర్బ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్తాన్ రాయల్స్. జోస్ బట్లర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.

13 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. కట్ చేస్తే.. కోహ్లీ రికార్డు తునాతునకలు..!
Virat Kohli
Follow us

|

Updated on: Apr 17, 2024 | 1:15 PM

జోస్ ది బాస్.. ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీంను.. తన సూపర్బ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్తాన్ రాయల్స్. జోస్ బట్లర్ తన అసమానమైన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బట్లర్‌ ఒక్కడే చివరి వరకు మ్యాచ్‌ను చేజారకుండా చూసుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టడమే కాదు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండోసారి రాజస్థాన్ జట్టుకు పెద్ద లక్ష్యాన్ని చేధించడంలో కీలక పాత్ర పోషించాడు జోస్ బట్లర్.

జోస్ బట్లర్ కేకేఆర్‌తో జరిగిన ఇన్నింగ్స్‌లో 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 107 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 178.33. ఐపీఎల్ కెరీర్‌లో బట్లర్‌కి ఇది 7వ సెంచరీ కాగా, టీ20 కెరీర్‌లో 8వ సెంచరీ. ఇక లక్ష్యచేధనలో బట్లర్‌కి ఇది మూడో సెంచరీ. ఈ సెంచరీతో జోస్ బట్లర్.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటిదాకా రన్ చేజింగ్‌లో విరాట్ కోహ్లీ(2), బెన్ స్టోక్స్(2) రెండేసి సెంచరీలు బాదేశారు. కానీ ఇప్పుడు జోస్ బట్లర్ మూడో సెంచరీ కొట్టి.. ఈ రికార్డు బద్దలు కొట్టాడు.

ఆర్ఆర్‌కి ఇది ఐపీఎల్‌లో రెండో అతిపెద్ద చేజ్..

జోస్ బట్లర్ పేలుడు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ జట్టు కేకేఆర్‌పై 224 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి చేజ్ చేసింది. దీంతో రాజస్తాన్ రాయల్స్.. ఐపీఎల్‌లో రెండో భారీ స్కోరును చేజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్ జట్టు తొలిసారిగా 2020లో పంజాబ్ కింగ్స్‌పై 224 పరుగుల లక్ష్యాన్ని చేధించిన విషయం తెలిసిందే.

Latest Articles
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన ముంబై.. డేంజరస్ బౌలర్ల రీఎంట్రీ
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!