RCB vs LSG, IPL 2024: లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోహ్లీ టీమ్‌లో ఖతర్నాక్ బౌలర్‌

|

Apr 02, 2024 | 7:48 PM

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 15వ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్‌జెయింట్‌లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్..

RCB vs LSG, IPL 2024: లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోహ్లీ టీమ్‌లో ఖతర్నాక్ బౌలర్‌
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants
Follow us on

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 15వ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్‌జెయింట్‌లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం RCB తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చేసింది. , అల్జారీ జోసెఫ్ స్థానంలో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ రీస్ టాప్లీకి తుది జట్టులో స్థానం కల్పించింది. ఇప్పటి వరకు రెండు జట్లూ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో యువ బౌలర్ మయాంక్ యాదవ్ పైనే అందరి దృష్టి ఉంది. గతసారి పంజాబ్‌పై అరంగేట్రం చేసిన అతను తన సంచలన బౌలింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నేటి మ్యాచ్‌లో   విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్‌వెల్ వంటి పటిష్టమైన బ్యాట్స్‌మెన్‌లు సవాల్‌గా మారనున్నాడు మయాంక్‌

ఇవి కూడా చదవండి

మ్యాచ్ విశేషాలు..

  • లక్నోలో కూడా మార్పు చోటు చేసుకుంది. మొహ్సిన్ ఖాన్ స్థానంలో యశ్ ఠాకూర్  జట్టులోకి వచ్చింది.
  • బెంగళూరు జట్టులో భారీ మార్పు, అల్జారీ జోసెఫ్ స్థానంలో రీస్ టాప్లీకి అవకాశం లభించింది
  • చిన్నస్వామి మైదానంలో విరాట్ కోహ్లీకి 100వ మ్యాచ్.

RCB ప్లేయింగ్ XI: 

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), యశ్ దయాల్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.

LSG ప్లేయింగ్ XI :

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), KL రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడికల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..