IPL 2023: ఢిల్లీకి షాక్ ఇచ్చిన కోహ్లీ మెచ్చిన ప్లేయర్.. తొలి మ్యాచ్‌లోనే భారీ రికార్డ్..

Updated on: Apr 15, 2023 | 9:00 PM

IPL 2023: ఈ మ్యాచ్‌లో RCB ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది.

1 / 7
IPL 2023 RCB vs DC: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB పేసర్ వైశాఖ్ విజయకుమార్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించాడు. అది కూడా తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే కావడం విశేషం.

2 / 7
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీని తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శుభారంభం లభించలేదు.

3 / 7
ఓపెనర్ పృథ్వీ షా రనౌట్ అయిన వెంటనే, మిచెల్ మార్ష్ పార్నెల్‌కు వికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత యష్ ధుల్ సిరాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే క్రీజులో నిలదొక్కుకున్న డేవిడ్ వార్నర్ వికెట్ మాత్రం ఆర్సీబీకి తప్పనిసరిగా మారింది.

4 / 7
ఈ దశలో ఐపీఎల్ తొలి ఓవర్ వేయడానికి వచ్చిన వైశాఖ్.. తన 4వ బంతికే డేవిడ్ వార్నర్ వికెట్ తీశాడు. తర్వాతి ఓవర్లలో ప్రమాదకర అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ వికెట్లు తీసి మెరిశాడు.

5 / 7
అలాగే తొలి మ్యాచ్ లో వైశాఖ్ విజయకుమార్ 4 ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో పాటు 3 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

6 / 7
అంటే ఆర్‌సీబీ తరపున అరంగేట్రం చేసిన భారత అత్యుత్తమ పేసర్‌గా వైశాక్ విజయ్‌కుమార్ రికార్డు సృష్టించాడు. అలాగే, రాబోయే మ్యాచ్‌లకు కూడా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు.

7 / 7
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.