IPL 2023: వన్డే సారథి అన్నారు.. టీంలోనే లేకుండా చేశారు.. కట్‌చేస్తే.. సరికొత్త చరిత్రతో స్ట్రాంగ్ వార్నింగ్..

|

Apr 06, 2023 | 9:42 PM

ఐపీఎల్ 2023లో శిఖర్ ధావన్ బ్యాట్ ఘాటుగా మాట్లాడుతోంది. అలాగే తన కెప్టెన్సీతోనూ ధావన్ ఆకట్టుకుంటున్నాడు. ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడగా, రెండింట్లో గెలిచింది.

1 / 7
IPL 2023లో, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. అతని కంటే ముందు కేవలం ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే దీన్ని చేయగలిగారు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్‌లో 8వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ తన ఐపీఎల్ కెరీర్‌లో యాభైవ అర్ధ సెంచరీని సాధంచాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా శిఖర్ ధావన్ నిలిచాడు.

2 / 7
ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన  మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో 50వ సారి హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా ధావన్ నిలిచాడు.

3 / 7
శిఖర్ ధావన్ కంటే ముందు విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్‌లో అలాంటి ఫీట్ చేశారు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అత్యధికంగా 60 హాఫ్ సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ముంబైపై 50వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలో శిఖర్ ధావన్ పేరు కూడా చేరింది. ధావన్ ఇప్పుడు ఐపీఎల్‌లో 50 హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శిఖర్ ధావన్. ఐపీఎల్‌లో 200కు పైగా మ్యాచ్‌ల్లో 6000కు పైగా పరుగులు చేశాడు.

4 / 7
రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించడంలో శిఖర్ ధావన్ పాత్ర కీలకం. అతను 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొదటి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, తర్వాతి 26 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

5 / 7
శిఖర్ ధావన్ 207 ఇన్నింగ్స్‌ల్లో 50 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు చేశాడు. విరాట్ కోహ్లీ 216 ఇన్నింగ్స్‌ల్లో ఈ పని చేశాడు. కాగా, ఐపీఎల్‌లో 132 ఇన్నింగ్స్‌ల్లో డేవిడ్ వార్నర్ ఈ రికార్డు సృష్టించాడు.

6 / 7
50 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన శిఖర్ ధావన్.. 22 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ కూడా ఉంది. ఈ విషయంలో 23 సార్లు నాటౌట్‌గా వెనుదిరిగిన ఏబీ డివిలియర్స్ పేరిట ఈ రికార్డు ఉంది.

7 / 7
ఐపీఎల్ మ్యాచ్‌లలో జట్టు టాప్ స్కోరర్‌గా కూడా శిఖర్ ధావన్‌కు భారత బ్యాట్స్‌మెన్‌లో సాటి లేదు. అతను ఇప్పటివరకు 27 సార్లు జట్టు విజయంలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.