AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: స్పిన్‌ ఉచ్చులో బొక్క బోర్లా పడ్డ బెంగళూరు.. 81 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో చిత్తు

సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సత్తా చాటింది. మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజృంభించింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.

IPL 2023: స్పిన్‌ ఉచ్చులో బొక్క బోర్లా పడ్డ బెంగళూరు.. 81 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో చిత్తు
Kkr Vs Rcb
Basha Shek
|

Updated on: Apr 07, 2023 | 5:30 AM

Share

సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సత్తా చాటింది. మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజృంభించింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. వరుణ్‌ చక్రవర్తి (15/4), సుయాశ్‌ శర్మ (30/3), సునీల్‌ నరైన్‌ (16/2) ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. విరాట్‌ కోహ్లీ (21), డుప్లెసిస్‌ (23), డేవిడ్‌ విల్లీ (20), బ్రేస్‌వెల్‌ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతాబ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఒకానొక దశలో ఆజట్టు 96 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే డేవిడ్ విల్లీ, ఆకాశ్ దీప్ చివరి వికెట్ కు 27 పరుగులు జోడించడంతో చివరకు 123 పరుగులకు ఆలౌటైంది. కిర్రాక్‌ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటర్లలో శార్దూల్ ఠాకూర్, రహమానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శార్దూల్ ఠాకూర్‌ 29 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక రహమానుల్లా 44 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అతని స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి. రింకూ సింగ్ కూడా (33 బంతుల్లో 46, . 2 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బ్రేస్ వెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!