ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ (ఐపీఎల్ 2023)కి ఇంకా చాలా సమయం ఉంది. అయితే, ప్రస్తుతం మినీ వేలం (ఐపీఎల్ వేలం) సందడి కొనసాగుతోంది. ఈ నెల 23న కొచ్చిలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఏ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు, ఎంత మంది క్రీడాకారులు అత్యధిక ధర పొందుతారనేది 23వ తేదీనే ఖరారు కానుంది. ప్రస్తుతం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలం కోసం, భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ వేలానికి ముందు, నవంబర్ 15 నాటికి, మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇందులో, కొన్ని జట్లు సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేయగా, కొన్నిజట్లు కొంతమంది ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేశాయి. దీంతో ఇప్పుడు మిగిలిన స్థలాల కోసం వేలం నిర్వహించనున్నారు. అయితే ఇందుకోసం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
మొత్తం 277 మంది విదేశీ ఆటగాళ్లలో, కేవలం రెండు జట్ల నుంచే అత్యధిక ప్లేయర్లు ఉన్నారు. ఇందులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది, ఆపై దక్షిణాఫ్రికా నుంచి 52 మంది ఆటగాళ్లు రేసులోకి దిగనున్నారు. అదే సమయంలో, నెదర్లాండ్స్, యుఎఇ, నమీబియా, స్కాట్లాండ్ వంటి జట్ల నుంచి కూడా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
దేశం | ఆటగాళ్లు |
ఆఫ్ఘనిస్తాన్ | 14 |
ఆస్ట్రేలియా | 57 |
బంగ్లాదేశ్ | 6 |
ఇంగ్లండ్ | 31 |
ఐర్లాండ్ | 8 |
నమీబియా | 5 |
నెదర్లాండ్స్ | 7 |
న్యూజిలాండ్ | 27 |
స్కాట్లాండ్ | 2 |
దక్షిణ ఆఫ్రికా | 52 |
శ్రీలంక | 23 |
యూఏఈ | 6 |
వెస్టిండీస్ | 33 |
జింబాబ్వే | 6 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..