IPL 2022: ‘పంజాబీ-పంజాబీ’ అంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో పాట పడిన పంజాబ్ ఆటగాళ్లు.. వైరల్‌ అయిన వీడియో..

చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత పంజాబ్ కింగ్స్(punjab kings) ఆటగాళ్ల తెగ ఎంజాయ్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాటలు పాడుతూ సంబురాలు చేసుకున్నారు...

IPL 2022: పంజాబీ-పంజాబీ అంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో పాట పడిన పంజాబ్ ఆటగాళ్లు.. వైరల్‌ అయిన వీడియో..
Ipl 2022

Updated on: Apr 04, 2022 | 8:27 AM

చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత పంజాబ్ కింగ్స్(punjab kings) ఆటగాళ్ల తెగ ఎంజాయ్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాటలు పాడుతూ సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. IPL 2022లో తమ మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌(chennai super kings)ను ఓడించి టోర్నమెంట్‌లో రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18వ ఓవర్లో కేవలం 126 పరుగులకే ఆలౌటైంది. దీంతో సీఎస్‌కే హ్యాట్రిక్‌ ఓటమి నమోదయింది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ఓటమి తర్వాత మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చింది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో సరదాగా గడిపారు.

పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో పాటలు పాడుతూ హమ్ చేస్తున్న వీడియోను తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జట్టులో విదేశీ సభ్యులైనా ఆటగాళ్లంతా ‘పంజాబీ – పంజాబీ’ అంటూ పాడుతున్నారు. అందరూ పాటకు తగ్గట్టుగా కోరస్ ఇస్తున్నారు. ఈ వీడియోలో శిఖర్ ధావన్, సందీప్ శర్మ వంటి కొంతమంది ఆటగాళ్లు పాటతో పాటు ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ కీలక పాత్ర పోషించాడు. తన ఆల్ రౌండ్ గేమ్‌తో ఆట మొత్తాన్ని మలుపు తిప్పాడు. లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో 60 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బంతితో 25 పరుగులకే 2 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్ చేస్తూ 2 క్యాచ్‌లు అందుకున్నాడు.

Read Also.. IPL 2022: ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోకి దూసుకొస్తున్న ఆటగాళ్లు.. టాప్‌ 5లోకి దూబే, లివింగ్‌స్టోన్..