IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగా వేలం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్‌లో ఈసారి ఎనిమిది జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటాయి. పాత ఎనిమిది జట్లు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. అదే సమయంలో, డిసెంబర్ 25 లోపు రెండు కొత్త జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, రెండు కొత్త జట్లు (లక్నో, అహ్మదాబాద్) వేలం పూల్‌కు వెళ్లిన ఆటగాళ్ల నుంచి ఒక్కొక్కరు ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవచ్చని తెలిసిందే. రెండు కొత్త జట్లకు డిసెంబర్ 25 వరకు సమయం ఉంది.
లక్నో కోచ్‌గా ఆండీ ఫ్లవర్..
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ IPL 2022లో లక్నో ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా కనిపించవచ్చు. రిపోర్ట్ ప్రకారం, ఇప్పటికే ఫ్లవర్‌తో ఫ్రాంచైజీ చర్చలు దాదాపుగా ముగిశాయని, త్వరలో ప్రకటించవచ్చని తెలిసింది.
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..
గత మూడు సీజన్‌లుగా పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను లక్నో జట్టుకు కెప్టెన్‌గా చేయవచ్చు. నివేదిక ప్రకారం, రాహుల్‌తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. లక్నో ఫ్రాంచైజీ రిటైన్ పాలసీ ప్రకారం రాహుల్‌ని తన జట్టులో చేర్చుకునే ఛాన్స ఉంది. పంజాబ్ కింగ్స్‌తో విడిపోవాలని రాహుల్ స్వయంగా నిర్ణయించుకోవడంతో రిటైన్ చేసుకోలేదు.