KKR vs PBKS: 4వికెట్లతో సత్తా చాటిన ఉమేష్ యాదవ్.. తక్కువ స్కోర్‌కే పంజాబ్ ఆలౌట్.. కోల్‌కతా టార్గెట్ 138..

|

Apr 01, 2022 | 9:18 PM

Kolkata Knight Riders vs Punjab Kings: పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137కే ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 138 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

KKR vs PBKS: 4వికెట్లతో సత్తా చాటిన ఉమేష్ యాదవ్.. తక్కువ స్కోర్‌కే పంజాబ్ ఆలౌట్.. కోల్‌కతా టార్గెట్ 138..
Ipl 2022 Umesh Yadav
Follow us on

ఈరోజు ఐపీఎల్‌(IPL 2022)లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders vs Punjab Kings) మధ్య 8వ మ్యాచ్ జరుగుతోంది. మంచు కారణంగా కెకెఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ తొలి నుంచి కష్టాలు పడుతూనే ఉంది. వరుసగా వికెట్లు కోల్పోతూ, తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137కే ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 138 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మరోవైపు, ఈ ఫ్రాంచైజీ కోసం కేకేఆర్ స్పీడ్ స్టార్ ఉమేష్ యాదవ్(Umesh Yadav) ఈరోజు తన 50వ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఇక పంజాబ్ బ్యాటర్లలో రాజపక్సే ఒక్కడే 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా 20 లోపే దుకాణం సర్దుకున్నారు. అగర్వాల్ 1, ధావన్ 16, లివింగ్‌స్టోన్ 19, రాజ్ బవా 11, షారుక్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బార్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చివర్లో రబాడ 25 పరుగులు చేసి, కొద్దిసేపు బౌండరీల వర్షం కురిపించి, కోల్‌కతా బౌలర్లను టెన్షన్ పెట్టాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, సౌథీ 2, శివం మావి, నరైన్ తలో ఒక వికెట్ పడగొట్టారు.

ఉమేష్ పవర్ ప్లేలో 50 వికెట్లు..

కేకేఆర్ పేసర్ ఉమేష్ యాదవ్ తొలి ఓవర్ లోనే పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఈ వికెట్‌తో ఐపీఎల్ పవర్ ప్లేలో 50 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉమేష్ నిలిచాడు. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సందీప్ శర్మ (53) రికార్డు సృష్టించాడు. జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ పేరు రెండవ స్థానంలో ఉంది. ఇద్దరూ తలో 52 వికెట్లు తీశారు.

రాజపక్సే 344 స్ట్రైక్ రేట్‌తో పరుగులు..

పంజాబ్ ఆటగాడు భానుక రాజపక్సే తుఫాను ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాడు తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 344.44గా నిలిచింది. భానుక వికెట్ శివమ్ మావి ఖాతాలో చేరగా, మిడాఫ్ వద్ద టిమ్ సౌతీకి క్యాచ్ ఇచ్చాడు. ఔటయ్యే ముందు, రాజపక్సే అదే ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టి, తర్వాతి మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.

పవర్ ప్లేలో ఇరు జట్లు తమ సత్తా చాటాయి..

పవర్ ప్లేలో కోల్‌కతా మయాంక్ అగర్వాల్ (1), భానుకా రాజపక్సే (31), శిఖర్ ధావన్ (16) వికెట్లను తీశారు. ఈ మూడు వికెట్లను ఉమేష్, మావి, సౌతీ తీశారు. అయితే బ్యాటింగ్‌తో తమ సత్తా చాటిన పంజాబ్ 10.33 రన్ రేట్‌తో 62 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్‌ ఎలెవన్‌ : మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్‌), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్‌ కీపర్‌), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్‌ ఎలెవన్‌: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(వికెట్‌ కీపర్‌), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

Also Read: 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు.. 340పైగా స్ట్రైక్‌రేట్.. కేకేఆర్ బౌలర్ల పాలిట పీడకలగా మారిన పంజాబ్ బ్యాటర్..

IPL 2022: కోల్‌కతా, బెంగళూరు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న కీలక ప్లేయర్లు..