ఈ ఏడాది ఐపీఎల్ ఆక్షన్ అతడే అత్యధిక ధర పలికాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ.. డొమెస్టిక్ కెరీర్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. గత ఐపీఎల్ సీజన్లలోనూ తనదైన శైలి దూకుడు ఆటతీరుతో ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీకి విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. క్రికెట్ గాడ్ సచిన్ పర్యవేక్షణలో.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారధ్యంలో ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక ధర పలికిన ఆ ఆటగాడు ఎవరో ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. అతడెవరో కాదు ఇషాన్ కిషన్.
ఐపీఎల్ 2022 ఆక్షన్‌లో రూ. 15.5 కోట్ల ధరతో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫ్రాంచైజీ నమ్మకం పెట్టుకున్నట్లుగానే మొదటి రెండు మ్యాచ్‌లలో 81, 54తో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. అయినప్పటికీ ముంబైకి విజయాలు దక్కలేదు. అయితే మిగతా రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఇషాన్ చేతులెత్తేశాడు. వరుసగా 14, 26 పరుగులతో పేలవ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐదో మ్యాచ్‌లోనైనా ఇషాన్ కిషన్ అదరగొట్టాలని ముంబై భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 4 మ్యాచ్‌లలోనూ 4 ఓటములతో పాయింట్ల పట్టిక చిట్టచివరి స్థానంలో ఉంది. తాజాగా ముంబై, పంజాబ్ కింగ్స్ మధ్య పూణే వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ముంబై తహతహలాడుతోంది. అయితే ఆ జట్టు విజయం సాధించాలంటే.. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, పొలార్డ్, బుమ్రాలు తిరిగి ఫామ్‌లోకి రావాలి. లేదంటే మరో ఓటమి తప్పేలా లేదు.