Bhuvneshwar Kumar: యార్కర్లతో చెలరేగిన భువనేశ్వర్‌ కుమార్‌.. 19వ ఓవర్‌ మెయిడిన్ చేసిన SRH బౌలర్..

|

May 18, 2022 | 7:22 AM

Ipl 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022)లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (SRH vs MI)ని ఓడించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Bhuvneshwar Kumar: యార్కర్లతో చెలరేగిన భువనేశ్వర్‌ కుమార్‌.. 19వ ఓవర్‌ మెయిడిన్ చేసిన SRH బౌలర్..
Bhuvaneshwar
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022)లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (SRH vs MI)ని ఓడించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ముంబై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే ఇప్పటికే ప్లేఆఫ్‌ల రేసు నుంచి తప్పుకున్న ముంబై ఈ ఓటమిని పట్టించుకోలేదు. కానీ హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌లో విజయం అవసరం, ఎందుకంటే ఇందులో గెలిస్తేనే ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. హైదరాబాద్ విజయంలో ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్(Bhuvneshwar) తన అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. క్లిష్ట సమయంలో మెయిడిన్‌ ఓవర్‌ వేశాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది. అయితే భువనేశ్వర్ 19వ ఓవర్లో ఆ అద్భుతం చేశాడు.

ఒకానొక సమయంలో విజయం వైపు వెళుతున్నట్లు కనిపించిన ముంబై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. తన ఖచ్చితమైన లైన్ అండ్‌ లెంగ్త్‌తో అద్భుతమైన యార్కర్‌కు పేరుగాంచిన భువనేశ్వర్ ఈ ఓవర్‌లో తన క్లాస్‌ని చూపించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంతేకాదు వికెట్ కూడా తీశాడు. ఆ ఓవర్ రెండో బంతికే సంజయ్ యాదవ్‌కు పెవిలియన్‌కు చేర్చాడు. 19వ ఓవర్‌లో వీలైనన్ని ఎక్కువ యార్కర్లు వేయాలని భువనేశ్వర్ ప్రయత్నం చేయగా, సఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ తన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను మిస్ అయితే బౌండరీకి ​వెళ్లకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువ అని తెలుసు కాబట్టి నేను యార్కర్లు వేయడానికి ప్రయత్నించాను. నేను బౌండరీ ఇస్తే ఒత్తిడికి లోనవుతానని నాకు తెలుసు, నేను యార్కర్‌కి అతుక్కుపోయాను. ఈ సీజన్‌లో నేను బౌలింగ్ చేసిన విధానంతో నేను సంతృప్తి చెందాను” అని అన్నాడు.ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక మెయిడిన్ సహా 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అతను ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌లో నటరాజన్‌ చెత్తగా బౌలింగ్ చేశాడు. 17వ ఓవర్‌లో నటరాజన్‌ నాలుగు సిక్స్‌లు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడవార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..