IPL 2021, PBKS vs RR: 9 నెలలు 236 సిక్సర్లు.. ఫోర్ల కంటే ఎక్కువ బాదేసిన రాజస్థాన్ ప్లేయర్లు.. ఆ ముగ్గురు ఎవరంటే?

|

Sep 21, 2021 | 3:50 PM

IPL 2021: ఐపీఎల్ 2021 లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో..

IPL 2021, PBKS vs RR: 9 నెలలు 236 సిక్సర్లు.. ఫోర్ల కంటే ఎక్కువ బాదేసిన రాజస్థాన్ ప్లేయర్లు.. ఆ ముగ్గురు ఎవరంటే?
Pbks Vs Rr, Ipl 2021
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021 లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో తమ మొదటి సగం మంది ఆటగాళ్లు లేకుండా ఆడుతున్నారు. రాయల్స్‌కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేరు. అలాగే పంజాబ్ కింగ్స్‌కు డేవిడ్ మలన్, రిలే మెరెడిత్ వంటి ప్లేయర్లు అందుబాటులో లేరు. కానీ ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం మాత్రం పక్కాగా కనిపిస్తుంది. రెండు జట్లలోనూ సిక్స్‌లు దంచే ఆటగాళ్లు ఉన్నారు. ఈ విషయంలో చూస్తే, రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఒకరు కాదు ఏకంగా ముగ్గురు ప్లేయర్లు సిక్స్‌లు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు ఈ ఏడాదితో మొత్తం 236 సిక్సర్లు కొట్టారు. టీ 20 క్రికెట్‌లో ఈ ముగ్గురు ఫోర్ల కంటే సిక్సులతోనే మాట్లాడుతున్నారు. ఈ ఆటగాళ్లు మూడు వేర్వేరు దేశాల నుంచి వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ బలాన్ని మరింత పెంచేందుకు రెడీ అయ్యారు.

ముగ్గురూ కలిసి 236 సిక్సర్లు..
గ్లెన్ ఫిలిప్స్, ఎవిన్ లూయిస్ మొదటిసారి రాజస్థాన్‌తో ఆడుతున్నారు. ప్రథమార్ధంలో ఇద్దరూ ఐపీఎల్‌లో భాగం కాలేదు. లివింగ్‌స్టోన్ ప్రథమార్ధంలో ఉన్నాడు. కానీ కరోనా కేసులు బయటపడకముందే తన దేశానికి తిరిగి వెళ్లాడు. అప్పటి నుంచి అతను టీ20 క్రికెట్‌లో సందడి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు రాజస్థాన్ జట్టులో భాగం అయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ ఈ సంవత్సరం 87 సిక్సర్లు, లియామ్ లివింగ్‌స్టోన్ 81, ఎవిన్ లూయిస్ 68 సిక్సర్లు బాదారు. సిక్సులు కొట్టేందుకు పోటీ పడనున్నారని అర్థమవుతోంది. ఎలాంటి బౌలర్‌కైనా చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు.

లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్‌తో పాటు ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్ వంటి టోర్నమెంట్‌లలో సంచలన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. ఈ ఏడాది 33 టీ 20 లు ఆడాడు. 157.73 స్ట్రైక్ రేట్ వద్ద 44.92 సగటుతో 1213 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 81 ఫోర్లు, 81 సిక్సర్లు రాలాయి. ఈ ఏడాది టీ 20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేయడంలో అతను మూడో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన 24 ఏళ్ల గ్లెన్ ఫిలిప్స్ మొదటిసారి ఐపీఎల్‌లోకి ఆడుతున్నాడు. ఈ ఏడాది టీ 20 క్రికెట్‌లో అతడిలా ఎవరూ ఆడలేదు. ఫిలిప్స్ 45 మ్యాచ్‌లలో 36.08 సగటు, 153 స్ట్రయిక్ రేట్‌తో 1263 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 78 ఫోర్లు, 87 సిక్సర్లు కొట్టాడు.

వెస్టిండీస్‌కు చెందిన ఎవిన్ లూయిస్ గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. ఇప్పుడు రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అతను 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 38.57 సగటు, 163.96 స్ట్రైక్ రేట్‌తో 810 పరుగులు చేశాడు. అతని పేరుతో 56 ఫోర్లు, 68 సిక్సర్లు ఉన్నాయి.

Also Read: Ramiz Raja: టీ20 వరల్డ్ కప్‌లో ఆ మూడు జట్లు పాక్ టార్గెట్.. PCB ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు

PBKS vs RR, IPL 2021 Match Prediction: ముంబై ప్లేస్‌కు చెక్ పెట్టేందుకు ఇరుజట్లు రెడీ! అరుదైన రికార్డుకు చేరువలో రాహుల్

రాయల్స్‌ను రాహుల్ సేన అడ్డుకోగలదా.? టోర్నీలో నిలవాలంటే కింగ్స్ తప్పక గెలవాల్సిందే.!