MS Dhoni-Ziva: విన్నింగ్ మూమెంట్‎ను భార్య, కూతురితో కలిసి ఎంజాయ్ చేసిన ధోనీ.. వైరల్‌‎గా మారిన వీడియో..

|

Oct 16, 2021 | 3:29 PM

చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‎లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి...

MS Dhoni-Ziva: విన్నింగ్ మూమెంట్‎ను భార్య, కూతురితో కలిసి ఎంజాయ్ చేసిన ధోనీ.. వైరల్‌‎గా మారిన వీడియో..
Dhoni
Follow us on

చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‎లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గ్రౌండ్ మొత్తం చప్పట్లతో మోగింది. అయితే ఈ మ్యాజిక్ విన్నింగ్ క్షణాన్ని ధోని భార్య సాక్షి, కూతరు జివా కూడా ఎంజాయ్ చేశారు. చైన్నై గెలిచిన వెంటనే సాక్షి, జివా గంతులు వేస్తూ ధోనీ వద్దకు వచ్చారు. దీంతో కెమెరాలన్ని సాక్షి, జివా పై ప్యాన్ అయ్యాయి. వారు వచ్చిన వెంటనే ధోని సాక్షి, జివాను కౌగిలించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. సురేష్ రైనా భార్య ప్రియాంక చౌదరి, పిల్లలు కూడా కేకేఆర్‌పై సీఎస్కే విజయాన్ని ఆస్వాదించారు.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఇది 4 వ ఐపీఎల్ టైటిల్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండో జట్టుగా చైన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి మొదటి స్థానంలో ఉంది. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‎లో గెలిచిన తర్వాత ధోనీ మాట్లాడుతూ” నేను సీఎస్కే గురించి మాట్లాడటానికి ముందు, కేకేఆర్ గురించి మాట్లాడటం ముఖ్యం. మొదటి దశ తర్వాత వారు ఈ స్థానానికి రావడం గొప్ప విషయం. వారు చాలా కష్ట పడ్డారు. ఈ సంవత్సరం ఐపీఎల్ గెలవడానికి ఏదైనా జట్టు అర్హత కలిగి ఉందంటే, అది కేకేఆర్ అని నేను భావిస్తున్నాను. విరామం వారికి సహాయపడిందని నేను భావిస్తున్నాను” అని అన్నారు.

 

Read Also.. Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్ ఆట చాలా గొప్పగా ఉంది.. అతని వల్లే జట్టు ఫైనల్‎కు చేరింది.. ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్..