Virat Kohli: విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్ ఇచ్చిన రెండు దారుణ పరాజయాలు.. అవేంటంటే?

|

Sep 21, 2021 | 5:27 PM

KKR vs RCB: విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ తరపున 200 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. ఇలాంటి ఓ గొప్ప మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్ ఇచ్చిన రెండు దారుణ పరాజయాలు.. అవేంటంటే?
Kkr Vs Rcb, Ipl 2021 Virat Kohli
Follow us on

KKR vs RCB: విరాట్ కోహ్లీ 200 వ ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ టీం ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేరకుంది. ఈ ఓటమితో ఆర్‌సీబీ జట్టు 13 ఏళ్ల క్రితం పరాజయం పాలైన మ్యాచ్‌ను గుర్తుచేసుకుంది. ఎందుకంటే ఈ రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ టీం కేకేఆర్‌పైనే ఓడిపోవడం విశేషం. కోహ్లీకి ఈ రెండు మ్యాచ్‌లు కూడా ఎంతో ముఖ్యమైనవి.

ఆర్‌సీబీ, కేకేఆర్ 2008 లో తొలి ఐపీఎల్ అరంగేట్రంలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ కోసం అరంగేట్రం చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం.. బ్రెండన్ మెక్‌కల్లమ్ 158 పరుగులతో రాణించగా.. 222 పరుగుల టార్గెట్‌ను ఆర్‌సీబీ ముందు ఉంచింది. ఈ భారీ స్కోర్‌ను ఛేజ్ చేస్తూ ఆర్‌సీబీ టీం కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. అంటే 140 పరుగుల భారీ తేడాతో కోహ్లీ సేన ఓడిపోయింది. ఆర్‌సీబీ జట్టుకు ఇది అత్యంత ఘోరమైన ఓటమి.

కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచుతో విరాట్ కోహ్లీ 200 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. ఇలాంటి డబుల్ సెంచరీ మ్యాచులో కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కేకేఆర్ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 92 పరుగులు సాధించి విజయం ముంగిట నిలిచింది. దీంతో 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. కేకేఆర్ 60 బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ జట్టును ఓడించింది. ఇది బాల్స్ పరంగా ఆర్‌సీబీ టీంకు అత్యంత ఘోరమైన ఓటమి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ సేన ఐపీఎల్‌లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూడడం యాదృచ్చికం.

Also Read: KKR vs RCB: ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాకిచ్చిన సీఏ, ఆర్కిటెక్ స్టూడెంట్లు.. వారెవరో తెలుసా?

Pakistan: బిర్యానీ వివాదానికి తెరలేపిన పాకిస్తాన్..! వాళ్ల కోసం 27 లక్షలు ఖర్చు చేసిందట..

IPL 2021, PBKS vs RR: 9 నెలలు 236 సిక్సర్లు.. ఫోర్ల కంటే ఎక్కువ బాదేసిన రాజస్థాన్ ప్లేయర్లు.. ఆ ముగ్గురు ఎవరంటే?