IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: తొలి క్వాలిఫయర్‌లో టాప్‌ టీంల పోరాటం.. మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

|

Oct 10, 2021 | 10:33 AM

IPL 2021, DC vs CSK: ఐపీఎల్ 2021 లో ఆదివారం జరిగే మొదటి క్వాలిఫయర్‌లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: తొలి క్వాలిఫయర్‌లో టాప్‌ టీంల పోరాటం.. మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
Ipl 2021, Csk Vs Dc
Follow us on

IPL 2021, CSK vs DC: ఐపీఎల్ 2021 లీగ్ రౌండ్ ముగిసింది. ప్రస్తుతం ప్లేఆఫ్ మ్యాచ్‌ల వంతు వచ్చింది. ప్లే ఆఫ్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. లీగ్ రౌండ్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో ఢిల్లీ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో రెండవ స్థానంలో ఉంది. మొదటి క్వాలిఫయర్‌లో ఏ జట్టు గెలిచినా నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. అదే సమయంలో, ఓడిపోయిన జట్టు ఫైనల్ టికెట్ కోసం మరో మ్యాచ్‌ ఆడనుంది.

గత ఏడాది ప్లేఆఫ్‌కి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ టీం.. ఈ ఏడాది మంచి ఆటతీరుతో ప్లఆఫ్‌ పోరులో తలడుతోంది. చెన్నై టీం 12 ఐపీఎల్‌లో 11 సార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే చివరికి వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా దెబ్బతీసింది. ఢిల్లీ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన భరత్ ఈ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టి ఢిల్లీకి షాక్ ఇచ్చాడు.

ఈ సీజన్‌లో ఢిల్లీదే పైచేయి
మొదటి దశలో ధోని సేనపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత ఢిల్లీ టీం చెన్నైపై 2-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ఈ సీజన్‌లో మూడోసారి ఇరు జట్లు తలపడబోతున్నాయి. మొత్తంగా ఐపీఎల్‌లో ఇరు జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఢిల్లీ 25 మ్యాచ్‌లలో 10 గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం 15 మ్యాచుల్లో విజయం సాధించింది.

DC vs CSK మధ్య IPL 2021లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

DC vs CSK IPL 2021 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ అక్టోబర్ 10 ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది.

DC vs CSK మధ్య IPL 2021 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

డీసీ వర్సెస్ సీఎస్‌కే మధ్య ఐపీఎల్ 2021 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ వేయనున్నారు.

DC vs CSK మధ్య IPL 2021 మొదటి క్వాలిఫైయర్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

DC vs CSK మధ్య IPL 2021 మొదటి క్వాలిఫైయర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Also Read: Piyush Chawla: టీ20ల్లో పీయుష్‌ చావ్లా సరికొత్త రికార్డ్..! ఏంటో తెలుసుకోండి..

Rohit Sharma: ప్లే ఆఫ్స్‌కి వెళ్లకపోయిన పర్వాలేదు.. కానీ 4 సార్లు ట్రోపీ గెలిచాం..