IPL 2021: విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల మధ్య బౌండరీల పోరు.. ఎవరు ముందున్నారో తెలుసా?

|

Sep 17, 2021 | 1:26 PM

IPL 2021లో విరాట్ కోహ్లీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి డేవిడ్ వార్నర్‌తో బౌండరీలైన్‌ వద్ద పోరాటం కూడా ఉంది.

IPL 2021: విరాట్ కోహ్లీ,  డేవిడ్ వార్నర్‌ల మధ్య బౌండరీల పోరు.. ఎవరు ముందున్నారో తెలుసా?
Kohli Vs Warner
Follow us on

Virat vs Warner: విరాట్ కోహ్లీ ప్రస్తుతం వార్తల్లో ఉన్నాడు. ఎందుకంటే అతను టీమిండియా టీ 20 టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. డేవిడ్ వార్నర్‌, విరాట్ కోహ్లీ మధ్య పెద్ద పోరు జరగనుంది. ఈ పోరాటంలో ఎవరు ఎవరిని దాటేసి వెళ్లనున్నారో చూడాలి. యూఏఈలో ఐపీఎల్‌ 2021 ఆట మొదలయ్యాక మాత్రమే తొలి స్థానంలో ఎవరుంటారో తెలియనుంది. ఐపీఎల్ 2021లో బౌండరీ లైన్ విషయంలో కుడి చేతి వాటం కోహ్లీతో ఎడమ చేతి వాటం వార్నర్ మధ్య యుద్ధం తీవ్రంగా ఉండనుంది. బౌండరీల విషయంలో ఇద్దరి మధ్య తేడా చాలా తక్కువగానే ఉంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్. 634 ఫోర్లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. తన నంబర్ వన్ స్థానాన్ని ఇప్పట్లో ఎవరూ తాకలేరు. కానీ, రెండవ, మూడవ స్థానాల కోసం డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ మధ్య విపరీతమైన పోరు నెలకొంది.

విరాట్, వార్నర్ మధ్య దూరం ఎంతంటే..
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ అత్యధిక ఫోర్లు కొట్టడంలో 2 వ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. వీరి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ వార్నర్ 525 ఫోర్లతో రెండో స్థానంలో ఉండగా, కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 524 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంటే, వార్నర్, విరాట్ మధ్య దూరం కేవలం ఒక ఫోర్ మాత్రమే ఉంది.

ప్రస్తుతం ఈ పోరులో ఎవరు విజేతగా నిలవనున్నారో యూఏఈ ఆటలో తెలుస్తోంది. ఇద్దరి మధ్య దూరం చాలా తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో మార్పులు రెండో దశ పూర్తయ్యే వరకు జరుగుతుండవచ్చు. 6000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ లిస్టులో డేవిడ్ వార్నర్ చాలా వెనుకబడి ఉన్నాడు. అయితే టాప్ 5 జాబితాలో డేవిడ్ వార్నర్ ఐదవ స్థానంలో నిలిచాడు.

Also Read: Sunil Gavaskar: ఆ విషయంలో విఫలమైన భారత లెజెండ్ సునీల్ గవాస్కర్.. నోటిసులిచ్చిన మహారాష్ట్ర.. కారణం ఏంటంటే?

IPL 2021 Schedule: హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్.. రోహిత్ టీం పూర్తి షెడ్యూల్..!