Interesting Test Match: కేవలం 11 గంటల్లో ముగిసిన టెస్ట్‌… మ్యాచ్‌ కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న ప్లేయర్‌.. ఆసక్తికరమైన టెస్ట్‌ మ్యాచ్‌..

|

Feb 07, 2021 | 12:36 AM

Interesting Test Match 36 Years Ago: క్రికెట్‌ అంటేనే ఎంతో ఆసక్తికరమై ఆట.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. అప్పటి వరకు గెలుస్తుందనుకున్న జట్టు అంతలోనే ఓడిపోవచ్చు. ఓటమి అంచుల్లో ఉన్న జట్టు ఒక్కసారిగా విజయాన్ని అందుకోవచ్చు. ఇలా...

Interesting Test Match: కేవలం 11 గంటల్లో ముగిసిన టెస్ట్‌... మ్యాచ్‌ కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న ప్లేయర్‌.. ఆసక్తికరమైన టెస్ట్‌ మ్యాచ్‌..
Follow us on

Interesting Test Match 36 Years Ago: క్రికెట్‌ అంటేనే ఎంతో ఆసక్తికరమై ఆట.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. అప్పటి వరకు గెలుస్తుందనుకున్న జట్టు అంతలోనే ఓడిపోవచ్చు. ఓటమి అంచుల్లో ఉన్న జట్టు ఒక్కసారిగా విజయాన్ని అందుకోవచ్చు. ఇలా క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు అని చెబుతుంటారు. ఇలాగే 36 ఏళ్ల క్రితం ఓ అద్భుత టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆ ఆసక్తికర మ్యాచ్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

11 గంటల్లోనే పూర్తి..

1984లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ల మధ్య ఓ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్‌ 307 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో అప్పటి న్యూజిలాండ్‌ ప్లేయర్‌ రిచర్డ్‌ హెడ్లీ 99 పరులు చేశాడు. ఇక అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ దారుణంగా విఫలమైంది. కేవలం 82 పరుగులకే టీమ్‌ మొత్తం అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లో అత్యధిక స్కోరు మైక్‌ గాటింగ్‌ (19) కావడం గమనార్హం. జట్టులోని ఎనిమిది మంది డబుల్‌ ఫిగర్‌ను కూడా చేరుకోలేకపోయారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అయినా గాడిలో పడుతుందని భావించిన ఇంగ్లండ్‌ జట్టు ఇందులోనూ ఘోరంగా విఫలమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లు మరోసారి రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 93 పరుగులు మించలేదు. దీంతో న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తు చేసింది. ఇదంతా కేంలం 11 గంటల 41 నిమిషాల్లోనే పూర్తికావడం విశేషం. ఐదు రోజుల పాటు జరగాల్సిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఇలా కేవలం 11 గంటల్లోనే పూర్తవడం అప్పట్లో సంచలనంగా మారింది.

మ్యాచ్‌ కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న ప్లేయర్‌..

జీవితంలో పుట్టుక, చావు ఎంత ముఖ్యమో వివాహం కూడా అంతే ముఖ్యమనుకుంటారు. పెళ్లి జరిగే రోజు ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ఇంగ్లండ్‌ టీమ్‌కు చెందిన పిటోజ్‌ మాత్రం టెస్ట్‌ మ్యాచ్‌ కోసం తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరగాల్సిన రోజునే పిటోజ్‌కు వివాహం ఖరారు అయ్యింది. అయితే దానికి ముందు రోజే పిటోజ్‌ ఆకస్మాత్తుగా న్యూజిలాండ్‌ పర్యటకను వెళ్లే ఇంగ్లండ్‌ జట్టులో ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్‌ అరంగేట్రం కావడంతో పిటోజ్‌ మ్యాచ్‌ కోసం పెళ్లిని కూడా వాయిదా వేసుకోవడం విశేషం. ఇక బౌలర్‌ అయిన పిటోజ్‌ ఈ మ్యాచ్‌లో మంచి ప్రతిభను కనబర్చినా.. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శతనో మ్యాచ్‌ ఓడిపోవాల్సి వచ్చింది. ఇలా 36 ఏళ్ల క్రితం జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇలాంటి రెండు అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం విశేషం.

Also Read: దుమ్మురేపిన యువ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. కేవలం 129 బంతుల్లోనే.!