India vs New Zealand: పుణెలో టర్నింగ్ ట్రాక్‌పై భారత్ వ్యూహానికి భంగం కలిగించిన న్యూజిలాండ్ స్పిన్నర్లు.. రోహిత్ సేన నోరు మూయించిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా కోల్పోయిన 20 వికెట్లలో 18 వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఈ మ్యాచ్ ఓటమితో పాటు సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు వైట్ వాష్ ముప్పును ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు ముందు, జట్టు ఈ బలహీనతను అధిగమించడానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద అడుగు వేశారు. దీని ప్రకారం ముంబై టెస్టుకు ముందు టీమిండియా ప్రాక్టీస్ చేసేందుకు 35 మంది బౌలర్లను నెట్స్‌లోకి దించినట్లు సమాచారం.
పుణె టెస్టులో ఘోర పరాజయం తర్వాత ఆటగాళ్ల దీపావళి సెలవులను రద్దు చేస్తూ హెడ్ కోచ్ గౌతం గంభీర్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. దీని ప్రకారం ఆటగాళ్లందరికీ రెండు రోజుల ప్రాక్టీస్ తప్పనిసరి చేసింది టీమ్ మేనేజ్‌మెంట్. అందుకే దీపావళి రోజు కూడా భారత బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో చెమటోడ్చనున్నారు. కాగా, ఆటగాళ్ల స్పిన్ బలహీనతను తగ్గించేందుకు 35 మంది బౌలర్లను ప్రాక్టీస్‌కు పిలవాలని టీమ్ మేనేజ్‌మెంట్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి అనుమతి కోరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
నివేదిక ప్రకారం, ఈ 35 మంది బౌలర్లలో స్పిన్నర్లనే ఎక్కువగా రంగంలోకి దించారంట. స్పిన్నర్లను ఎదుర్కోవడం ద్వారా కివీస్ స్పిన్నర్ల ముందు భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేలా చేయాలన్నది రోహిత్, గంభీర్ ప్లాన్. అయితే మరో రెండు రోజుల్లో ఈ బలహీనత ఏ మేరకు తొలగిపోతుందో టెస్టు మ్యాచ్ ప్రారంభమైన తర్వాతే తేలనుంది.
బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. ఇందులో భారత జట్టు తన ఉచ్చులో పడి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. నివేదిక ప్రకారం, మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, భారత జట్టు మరోసారి ఇలాంటి వికెట్‌ను డిమాండ్ చేసింది. బహుశా ఈ కారణంగానే కోచ్ గంభీర్ ఈసారి స్పిన్ ఆడేందుకు బ్యాట్స్‌మెన్స్‌ను ఇప్పటికే సిద్ధం చేశాడు.
ముంబై వాంఖడే పిచ్ స్పిన్నర్లకు మరింత మద్దతునిస్తుంది. దీంతో పాటు ఈ మైదానంలో భారత్ తరపున రవిచంద్రన్ అశ్విన్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. కానీ, జడేజా ఇక్కడ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతను కూడా 6 వికెట్లు తీయగలిగాడు. అయితే, టీమ్ ఇండియా జాగ్రత్త ఏంటంటే.. చివరిసారిగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఇక్కడ తలపడినప్పుడు అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. అతను ప్రస్తుత జట్టులో ఉండటం రోహిత్ జట్టులో టెన్షన్ పెంచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..