Rajiv Gandhi International Cricket Stadium: భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.
సోమవారం ఉదయం 9.32 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి టీమిండియా ఆటగాళ్లు చేరుకున్నారు. 9.51 నుంచి ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. 11 గంటల తర్వాత కసరత్తు ప్రారంభించిన భారత ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. మరోవైపు బౌలర్లు కూడా నెట్స్‌లో చెమటోడ్చి ఇంగ్లిష్ దళానికి వ్యతిరేకంగా వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను BCCI తన అధికారిక X ఖాతాలో షేర్ చేసింది.
ఇంగ్లండ్ జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే ఈ సిరీస్‌లో జరిగే 5 మ్యాచ్‌లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ జట్టు 7వ స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ విజయం సాధిస్తేనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పైకి చేరుకుంటుంది. అందుకే భారత్ కంటే ఇంగ్లండ్‌కే ఈ సిరీస్ కీలకంగా మారింది.
When it's almost "time" for the first Test ⏳#TeamIndia | #INDvENG | @IDFCFirstBank pic.twitter.com/QbswZ1AMWZ
— BCCI (@BCCI) January 23, 2024
హైదరాబాద్‌లో టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టు రికార్డు చాలా అద్భుతంగా ఉండటం గమనార్హం. మెన్ ఇన్ బ్లూ ఐదు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఈ మైదానంలో తన అద్భుతమైన రికార్డును కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లిష్ జట్టు హైదరాబాద్‌లో తొలి టెస్టు ఆడనుంది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.ఈ మేరకు ఆర్సీబీ టీం ప్లేయర్ రజత్ పాటిదార్‌ను టెస్ట్ స్వ్కాడ్‌లో చేర్చింది.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుండగా, చివరి టెస్టు మ్యాచ్‌కు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
జనవరి 25 నుంచి 29 వరకు – మొదటి టెస్ట్ (హైదరాబాద్)
ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – రెండో టెస్టు (విశాఖపట్నం)
ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
మార్చి 7 నుంచి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..