Yuzvendra Chahal: భార్య ధనశ్రీ వర్మతో యుజ్వేంద్ర చాహల్ చేసిన ఎక్సర్‌సైజ్ వీడియో నెట్టింట్ తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం వ్యాయామం చేయాలనిపించాలనే భావనకు వస్తారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన చాహల్.. ‘ధనశ్రీ చుట్టూ ఆలోచనలు తిరగడానికి ప్రతీ రోజు శిక్షణ తప్పనిసరి’ అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ రచ్చ చేస్తోంది.
ఇదిలాఉంటే.. ఈ వీడియో ప్లే చేయగానే తొలుత ధనశ్రీ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంటుంది. ఆ తరువాత చాహల్ ఎంట్రీ అవుతాడు. ఇద్దరూ కలిసి భారీ ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు సాయంగా వ్యాయామం చేస్తున్న ఈ వీడియో క్లిప్‌ను చాహల్ గురువారం నాడు తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 4.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. అదేస్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక చాలా మంది అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేశారు. చాలా మంది ఈ జంట వ్యాయామ కసరత్తులను ప్రశంసించారు. ఈ వీడియో చూడటం ద్వారా ఇతరులు ప్రేరణ పొందుతారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Chahal Video:
Also read:
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్… జూలై 1 నుంచి సవరించిన జీతాలు..
IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్కింగులో డిస్కౌంట్ పొందడం ఎలాగో తెలుసా..! అయితే ఇలా చేయండి..!