Indian Cricketer Vanitha VR: భారత మహిళా క్రికెటర్ వనిత వీఆర్ బోర్డు మాజీ సెలెక్టర్లను విమర్శించారు. ఆటగాళ్లు ప్రశ్నించినప్పుడు లేదా తమ పదవి నుంచి తప్పుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారని ఆరోపించారు. ఈ స్టార్ ప్లేయర్ ఈమేరకు సోషల్ మీడియాలో అభిమానుల ముందు వాపోయారు. అలాగే సెలెక్టర్లను విమర్శిస్తూ కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఇటీవల సెలెక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు ఎటువంటి కారణం చెప్పకుండా కొంతమంది ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వనిత 2014 లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం చేసింది. రెండు రోజుల తరువాత అదే పర్యటనలో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసింది. ఇప్పిటి వరకు ఆరు వన్డేల్లో 17 సగటుతో 87 పరుగులు సాధించింది. అదే సమయంలో 16 టీ 20 ల్లో 14.40 సగటుతో 216 పరుగులు బాదేసింది. 2016 టీ 20 ప్రపంచకప్‌లో వనిత కూడా జట్టులో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి జరిగే టీ 20 ప్రపంచ కప్‌లో ఆడడం లేదు. ఆమె 17 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడింది. ఆ తర్వాత బెంగాల్ తరపను ఆడింది.
సెలెక్టర్లలపై ప్రశ్నల వర్షం..
సెలెక్టర్లు తమ పదవి నుంచి తప్పుకున్నప్పుడు మాత్రమే ఆటగాళ్లతో మాట్లాడతారని వనిత ఆరోపించింది. శనివారం తన ఫేస్‌బుక్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘ఆటగాళ్లను జట్టు నుంచి బయటకు పంపే బాధ్యతను ఎవరైనా తీసుకుంటారు. ఎటువంటి కారణం లేకుండా జట్టుకు దూరంగా ఉంచుతారు. ఇలాంటి సమయంలో ఆటగాళ్లు అసంతృప్తికి గురవుతుంటారు. మాజీ సెలెక్టర్లు తమ పదవుల నుంచి తప్పుకున్న తర్వాత ఆటగాళ్లతో మాట్లాడతారు. కానీ, వారు పదవిలో ఉన్నప్పడు ఆ పని ఎందుకు చేయరో అర్థంకాదు’ అంటూ విమర్శించారు.
ఎంపికలో అన్యాయం..
వనిత పంచుకున్న కామెంట్ల స్క్రీన్ షాట్‌లో, ఆమె సెలెక్టర్ల పాత్రను కూడా ప్రశ్నించింది. ‘తప్పుడు నిర్ణయాలు తీసుకున్న మాజీ సెలెక్టర్లు ఎప్పుడు బాధ్యత వహిస్తారు. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసే నిర్ణయానికి ఎల్లప్పుడూ ఎందుకు క్రెడిట్ తీసుకోవాలి. మాజీ సెలెక్టర్లు ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Someone should take accountability of inclusion and exclusion of certain https://t.co/kz13nvJVle has become an absolute dilemma and devastating for players.Former selectors talk only after they leave the post Why don’t they talk or give an explanation when they are in helm. pic.twitter.com/j0XATvXSbq
— Vanitha VR (@ImVanithaVR) September 18, 2021
IPL 2021: ధోని 8 సిక్సర్లు కొట్టి ముంబైని హెచ్చరించాడు..! వీడియో చూస్తే అదిరిపోతారంతే..?