
India Women vs Pakistan Women, 6th Match: ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్, రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్. భారత జట్టు 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. హర్లీన్ డియోల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సమాధానంగా, పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. సిద్రా అమీన్ 81 పరుగులు చేసింది. భారత జట్టు తరపున క్రాంతి గౌర్, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టింది.
క్రికెట్‌లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో పురుషుల ఆసియా కప్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఓడించింది.
టాస్ సమయంలో రిఫరీ చేసిన పొరపాటు కారణంగా భారత్ టాస్ ఓడిపోయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాణెం విసిరింది. కానీ, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టెయిల్స్ అని పిలవగా. నాణెం హెడ్స్‌గా నేలపై పడింది. దక్షిణాఫ్రికా మ్యాచ్ రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ సనా పిలుపును హెడ్స్‌గా తప్పుగా చదివింది. దీంతో పాకిస్తాన్‌ను టాస్ విజేతగా ప్రకటించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..