SLW vs INDW: లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..

India vs Sri Lanka Women, Asian Games Final Result: హర్మన్ ప్రీత్ సేన ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని అందుకుంది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ అందుకుంది.

SLW vs INDW: లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
Ind W Vs Sl W, Final T20

Updated on: Sep 22, 2026 | 2:03 PM

India vs Sri Lanka Women, Asian Games Final Result: భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించింది. అంతకుముందు భారత జట్టు 2022 క్రీడల్లో కూడా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది.

మంధాన 79 పరుగుల ఇన్నింగ్స్..

భారత్ తరపున స్మృతి మంధాన 79 పరుగులు, రిచా ఘోష్ అజేయంగా 49 పరుగులు, మరియు షఫాలీ వర్మ 48 పరుగులు చేశారు. మంధాన, షఫాలీ కలిసి 99 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్‌లోనే మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 11,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నారు. శ్రీలంక తరపున సుగంధికా కుమారి, కవిషా దిల్హరి, చాముది ప్రభోద ఒక్కో వికెట్ తీశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us