IND vs WI 2nd ODI: వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో అప్‌లోడ్ అవ్వడంతో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను స్వయంగా టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు. ఇందులో వెస్టిండీస్ విజయంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆనందంతో కేకలు వేస్తున్నట్లు చూడొచ్చు.
ఈ పోస్ట్‌పై – టాలెంట్ గేమ్‌ను గెలుచుకుంది. కానీ, జట్టుకృషి, తెలివితేటలు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాయి. అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు’ అంటూ క్యాఫ్షన్ అందించాడు. ఈ వీడియోకు 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. తన కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న షాయ్ హోప్ 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు చేశాడు. భారత్ తరపున శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరపున అక్షర్ పటేల్ 64 పరుగులు చేశాడు. అదే సమయంలో, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ నుంచి 63 పరుగులు వచ్చాయి. సంజూ శాంసన్ తన వన్డే కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అతను 54 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
టీమ్ ఇండియా తిరుగులేని ఆధిక్యం..
భారత్ రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ సిరీస్ విజయం.
ఈ విజయంతో ఒకే జట్టు చేతిలో వరుసగా అత్యధిక సిరీస్‌లను సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది. జింబాబ్వేపై పాక్ జట్టు వరుసగా 11 వన్డే సిరీస్‌లలో విజయం సాధించింది.
ఈ నెలలో ఇంగ్లండ్‌ను 2-1తో ఓడించిన టీమిండియా..
ఇంగ్లండ్ టూర్ నుంచి నేరుగా వెస్టిండీస్‌కు చేరుకుంది. వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 2-1తో ఓడించింది. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో ఆ జట్టు వెస్టిండీస్‌ను 3-0తో ఓడించింది.