IND vs SL, Asia Cup 2023 Final Highlights: లంకపై ఘన విజయం.. 8వ సారి ఆసియా విజేతగా రోహిత్ సేన..

India Vs Sri Lanka, Asia Cup 2023 Highlights in Telugu: ఆసియా కప్ ఫైనల్లో రోహిత్ సేన 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది. భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు.

IND vs SL, Asia Cup 2023 Final Highlights: లంకపై ఘన విజయం.. 8వ సారి ఆసియా విజేతగా రోహిత్ సేన..
Ind Vs Sl Asia Cup Final 2023 Live Score

Updated on: Sep 17, 2023 | 6:33 PM

India Vs Sri Lanka, Asia Cup 2023 Highlights in Telugu: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో టీమిండియా 6.1 ఓవర్లలో 51 పరుగులు పూర్తి చేసి, 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. ఈ విజయంలో మహ్మద్ షమీ హీరోగా నిలిచాడు.

ఆసియా కప్ ఫైనల్లో రోహిత్ సేన 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది. భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు 15.2 ఓవర్లలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు.

2023 ఆసియా కప్‌లో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ తన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. కానీ, ఇది ఫైనల్‌కు చేరుకోవడానికి ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే, భారత జట్టు ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి ఫైనల్‌కు టికెట్ తీసుకుంది. మరోవైపు, ఇక్కడకు చేరుకోవడానికి, శ్రీలంక పాకిస్తాన్‌తో తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌ను ఆడవలసి వచ్చింది. అందులో మ్యాచ్ చివరి బంతికి గెలిచి, నూతనోత్సాహంతో నేడు బరిలోకి దిగనుంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 17 Sep 2023 06:09 PM (IST)

    8వ సారి ఆసియా విజేతగా భారత్..

    ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంక ఇచ్చిన 51 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.1 ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 27, ఇషాన్ కిషన్‌ 23 పరుగులతో నిలిచాడు.

  • 17 Sep 2023 05:54 PM (IST)

    10 రన్ రేట్‌తో భారత ఓపెనర్ల దూకుడు..

    3 ఓవర్లకు టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. గిల్ 18, ఇషాన్ 13 పరుగులతో నిలిచారు.


  • 17 Sep 2023 05:15 PM (IST)

    టీమిండియా టార్గెట్ 51..

    కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు శుభారంభం లభించలేదు. సిరాజ్ ఊచకోతతో శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 51 పరుగుల టార్గెట్ నిలిచింది.

  • 17 Sep 2023 05:00 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన శ్రీలంక

    13వ ఓవర్ మూడో బంతికి దునిత్ వెలలాగేను ఔట్ చేయడం ద్వారా హార్దిక్ పాండ్యా మరింత దెబ్బతీశాడు. భారత బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తూ.. క్లియర్ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

  • 17 Sep 2023 04:53 PM (IST)

    శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది

    శ్రీలంక ఏడో వికెట్‌ పడిపోయింది. 12వ ఓవర్ రెండో బంతికి కుసాల్ మెండిస్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కి ఇది ఆరో వికెట్. సిరాజ్ బౌలింగ్‌లో మెండిస్ అవుటయ్యాడు. 

  • 17 Sep 2023 04:37 PM (IST)

    10 ఓవర్లకు లంక..

    శ్రీలంక జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 31 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్, దునిత్ వెల్లాలఘే ఉన్నారు.

  • 17 Sep 2023 04:34 PM (IST)

    బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌లో సిరాజ్..

  • 17 Sep 2023 04:27 PM (IST)

    6వ వికెట్ కోల్పోయిన సమయంలో అత్యల్ప స్కోర్లు..

    10/6 కెనడా vs నెట్ కింగ్ సిటీ 2013
    12/6 కెనడా vs శ్రీలంక, పార్ల్ 2003
    12/6 శ్రీలంక vs భారత్, కొలంబో RPS 2023
    13/6 శ్రీలంక vs సౌతాఫ్రికా, పార్ల్ 2012

  • 17 Sep 2023 04:24 PM (IST)

    5 వికెట్లతో చెలరేగిన సిరాజ్..

    కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే శ్రీలంకకు ఆరంభం బాగాలేదు. దీంతో ఆ జట్టు 7 ఓవర్లలో 6 వికెట్లకు 17 పరుగులు చేసింది. సిరాజ్ 5 వికెట్లు తీశాడు. అతను చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, పాతుమ్ నిస్సాంక, దసున్ షనకలను ఔట్ చేశాడు.

  • 17 Sep 2023 04:07 PM (IST)

    India vs Sri Lanka Live Score: ఒకే ఓవర్లో 4 వికెట్లు..

    ఒకే ఓవర్లో సిరాజ్ నలుగురు లంక బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. దీంతో టాస్ గెలిచిన లంకకు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తన రెండో ఓవర్లో వికెట్ల ఖాతా ఓఫెన్ చేసిన సిరాజ్.. 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.

  • 17 Sep 2023 03:59 PM (IST)

    India vs Sri Lanka Live Score: సిరాజ్ చేతికి చిక్కిన నిస్సంకా

    టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంలకు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. బుమ్రా, సిరాజ్‌లు తలో వికెట్ పడగొట్టారు.

  • 17 Sep 2023 03:44 PM (IST)

    India vs Sri Lanka: తొలి వికెట్ డౌన్..

    తొలి ఓవర్ మొదలైన వెంటనే శ్రీలంకకు బుమ్రా షాక్ ఇచ్చాడు. మూడో బంతికి పెరేరా కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 17 Sep 2023 03:23 PM (IST)

    IND vs SL: తగ్గిన వర్షం.. 3.45కి మ్యాచ్ ప్రారంభం?

    ప్రస్తుతం కొలంబోలో వర్షం తగ్గింది. పిచ్‌పై ఉన్న కవర్లను ఇప్పటికే తొలగించారు. అంపైర్లు 3.30కి పిచ్‌ను పరిశీలించిన తర్వాతే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పనునున్నారు.

  • 17 Sep 2023 03:06 PM (IST)

    IND vs SL Weather Update: మొదలైన వర్షం..

    టాస్ పడిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో ఆట కొద్దిగా ఆలస్యంగా మొదలుకానుంది.

  • 17 Sep 2023 02:51 PM (IST)

    IND vs SL: టీమిండియా ఆసియా కప్ ఫైనల్ జర్నీపై బీసీసీఐ వీడియో..

  • 17 Sep 2023 02:49 PM (IST)

    IND vs SL Live Score: India Playing 11: టీమిండియా ప్లేయింగ్ 11

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

  • 17 Sep 2023 02:48 PM (IST)

    IND vs SL Live Score: Sri lanka Playing 11: శ్రీలంక ప్లేయింగ్ 11

    శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.

  • 17 Sep 2023 02:36 PM (IST)

    IND vs SL Live Score: టాస్ గెలిచిన శ్రీలంక..

    టాస్ గెలిచిన శ్రీలంక సారథి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈరోజు కొలంబోలో 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

  • 17 Sep 2023 02:21 PM (IST)

    ఆసియాకప్‌లో భారత్-శ్రీలంకల రికార్డులు ఇవే..

    భారత్-శ్రీలంక మధ్య జరిగే ఆసియా కప్‌లో ఎవరు గెలుస్తారు? ఇది తెలుసుకునే ముందు, ఫైనల్స్‌లో ఇరు జట్ల రికార్డు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 19 ఫైనల్స్‌లో తలపడగా, అందులో 2 ఫైనల్స్ అసంపూర్తిగా ఉన్నాయి. భారత్ 9 గెలుపొందగా, శ్రీలంక 8 గెలిచింది. పోటీ కఠినంగా ఉందని అర్థం.

  • 17 Sep 2023 02:15 PM (IST)

    రోహిత్ పేరిట 2 రికార్డులు..

    భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఈరోజు గొప్ప రోజు. ఇది ఆసియా కప్‌లో ఫైనల్‌ మాత్రమే కాదు, రెండు పెద్ద విజయాలను కూడా అందుకునే ఛాన్స్ ఉంది. మైదానంలోకి రాగానే రోహిత్ ఈ రెండు విజయాలు సాధిస్తాడు. ఈరోజు ఫైనల్ మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌కి 250వ వన్డే కానుంది. అలాగే 450వ అంతర్జాతీయ మ్యాచ్‌ అవుతుంది.

  • 17 Sep 2023 01:55 PM (IST)

    కొలంబోలో వాతావరణం ఎలా ఉంది?

    సమాచారం ప్రకారం ప్రస్తుతం కొలంబోలో వాతావరణం స్పష్టంగా ఉంది. ఆకాశంలో అలాంటి మేఘాలు లేవు. కానీ, అసలు ఆందోళన సాయంత్రం మొదలు కానుంది. ఎందుకంటే వాతావరణ మూడ్ చెడగొట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఫైనల్ మ్యాచ్‌పై వర్షం నీడ ఉందనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. విశేషం ఏంటంటే.. ఈ టైటిల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంచారు.

  • 17 Sep 2023 01:47 PM (IST)

    ఆసియా కప్‌లో భారత్-శ్రీలంక ఫైనల్‌ చరిత్ర

    ఆసియా కప్ ఫైనల్స్‌లో అత్యధికంగా తలపడిన జట్లుగా భారత్, శ్రీలంక అగ్రస్థానంలో నిలిచాయి. కేవలం వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ గురించి మాట్లాడుకుంటే, భారత్, శ్రీలంకలు ఈసారి 8వ సారి తలపడనున్నాయి. చివరి 7 ఫైనల్స్‌లో భారత్ 4-3 ఆధిక్యంలో ఉంది. ఆసియా కప్‌లో ఓవరాల్‌గా భారత జట్టు 10వ ఫైనల్ ఆడుతుంది. 8 వన్డే ఫార్మాట్ ఫైనల్స్ కాకుండా, 2 టీ20 ఫార్మాట్ ఫైనల్స్ ఉన్నాయి.