Ravindra Jadeja: కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా అరుదైన ఘనత

Ravindra Jadeja: శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో రవీంద్ర జడేజా WTCలో 50 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. కొలంబోలోని ఎస్‌ఎస్‌సి మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జడేజా 49 మ్యాచ్‌లు ఆడాడు.

Ravindra Jadeja: కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా అరుదైన ఘనత
Ravindra Jadeja

Updated on: Aug 23, 2026 | 7:09 AM

Ravindra Jadeja: భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆదివారం (ఆగస్టు 23) నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్లేయింగ్-11లో అడుగుపెట్టడమే తడవుగా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 50 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా జడేజా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.

విరాట్ కోహ్లీని అధిగమించి అగ్రస్థానం

ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జడేజా 49 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు భారత జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి జడేజా సమంగా ఉన్నాడు. అయితే కోహ్లీ ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పడంతో, ఈ రెండో టెస్ట్ ద్వారా జడేజా 50వ మ్యాచ్‌లోకి అడుగుపెట్టి కోహ్లీని అధిగమించి తొలి భారతీయ ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ 47వ మ్యాచ్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ WTC చరిత్రలో ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ (78 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

 ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

ఎస్‌ఎస్‌సి గ్రౌండ్‌లో జడేజాకు మంచి రికార్డు

కొలంబోలోని ఎస్‌ఎస్‌సి మైదానం జడేజాకు చాలా కలిసివచ్చిన వేదిక. గతంలో ఇక్కడ రెండు జట్లు తలపడినప్పుడు భారత్ ఒక ఇన్నింగ్స్, 53 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా, బౌలింగ్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుత సిరీస్‌లో కూడా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల విజయం సాధించగా, అందులో జడేజా 4 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

లైవ్ టెలికాస్ట్, మ్యాచ్ వేళలు

రెండు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆదివారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకుముందు ఉదయం 9:30 గంటలకు టాస్ పడనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో చూడవచ్చు. అలాగే డిజిటల్ వినియోగదారులు సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.

ఇది కూడా  చదవండి: IND vs AFG: ఒకే సమయంలో రెండు లీగ్‌లు.. అభిషేక్ శర్మ, శుభ్‎మన్ గిల్‌కు ఊహించని చిక్కులు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us