కెప్టెన్సీలోనే కాదు బ్యాటింగ్‌లోనూ ‘హిట్’మ్యాన్.. కోహ్లీకి మాత్రం నిరాశే.. రెండేళ్లలో ఎవరి గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

|

Dec 17, 2021 | 5:48 PM

Rohit Sharma vs Virat Kohli: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ తర్వాత టీమ్ ఇండియాలో వివాదాలు తెరపైకి వచ్చాయి. రోహిత్, కోహ్లిల మధ్య సఖ్యత బాగోలేదంటూ చర్చ నడుస్తోంది. ఇన్ని వివాదాల నడుమ, గత రెండేళ్లలో..

కెప్టెన్సీలోనే కాదు బ్యాటింగ్‌లోనూ హిట్మ్యాన్.. కోహ్లీకి మాత్రం నిరాశే.. రెండేళ్లలో ఎవరి గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
Rohit Sharma, Virat Kohli
Follow us on

Rohit Sharma vs Virat Kohli: టెస్టుల్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. విరాట్ మాత్రం పేలవఫాంతో తంటాలు పడుతున్నాడు. గత రెండేళ్లలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అదే సమయంలో, రోహిత్ ఈ కాలంలో టెస్టుల్లో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. 2020లో, కోహ్లి మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 6 ఇన్నింగ్స్‌లలో, అతని బ్యాట్‌ నుంచి 116 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ సమయంలో, విరాట్ సగటు 20 కంటే తక్కువగా ఉంది. ఇక 2021లో కూడా కోహ్లీ ఆటతీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది కూడా విరాట్ బ్యాట్‌తో ఒక్క సెంచరీ కూడా నమోదుచేయలేదు. అతని సగటు 28.41గా నిలిచింది. 2021లో 10 టెస్టులు ఆడిన విరాట్ కేవలం 483 పరుగులు మాత్రమే చేశాడు.

అదే సమయంలో, రోహిత్ శర్మ విషయానికి వస్తే.. 2021లో టీమ్ ఇండియా కోసం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 906 పరుగులు చేశాడు. 11 టెస్టు మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడి సగటు 47.68గా నిలిచింది. ఈ ఏడాది హిట్‌మన్ 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు.

2020లో రోహిత్ టీమ్ ఇండియా తరఫున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అదే సమయంలో, 2019లో, ఈ ఆటగాడు భారతదేశం తరపున 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. 2019లో రోహిత్ 5 టెస్టుల్లో 3 సెంచరీలు సాధించాడు.

రోహిత్ రెండేళ్లలో 6 వన్డేలు మాత్రమే..
గత రెండేళ్లలో రోహిత్ 6 వన్డేలు మాత్రమే ఆడాడు. అదే సమయంలో విరాట్ 12 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో రోహిత్ బ్యాటింగ్‌లో 43.50 సగటుతో 261 పరుగులు నమోదయ్యాయి. మరోవైపు కోహ్లీ రికార్డును పరిశీలిస్తే.. విరాట్ 12 మ్యాచ్‌ల్లో 46.66 సగటుతో 560 పరుగులు చేశాడు. అయితే ఈ 12 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అదే సమయంలో, రోహిత్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ సాధించాడు.

టీ20లో రోహిత్ స్ట్రైక్ రేట్ కోహ్లీ కంటే ఎక్కువ..
విరాట్ గత రెండేళ్లలో 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అదే సమయంలో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో జట్టులో భాగమయ్యాడు. ఈ సమయంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 137.41గా ఉంది. అదే సమయంలో రోహిత్ స్ట్రైక్ రేట్ 150.80గా ఉంది. ఈ సమయంలో విరాట్ బ్యాట్ నుంచి 20 సిక్సర్లు రాగా, కోహ్లీ కంటే రోహిత్ 10 సిక్సర్లు ఎక్కువగా కొట్టాడు. గత రెండేళ్లలో రోహిత్ 30 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ 49.50 సగటుతో పరుగులు చేయగా, రోహిత్ 40.28 సగటుతో ఉన్నాడు.

రోహిత్‌పై కోహ్లి ఏమన్నాడంటే..
దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు రోహిత్‌తో వివాదంపై విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్‌కి, తనకు మధ్య ఎలాంటి సమస్య లేదని, గత రెండున్నరేళ్లుగా క్లారిటీ ఇవ్వడంతోనే విసిగిపోయానని పేర్కొన్నాడు.

రోహిత్ కూడా కోహ్లీపై ప్రశంసలు..
వన్డే కెప్టెన్ అయిన తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి రోహిత్ మాట్లాడుతూ, ‘అతని కెప్టెన్సీలో ఆడటం నాకు గొప్ప అనుభవం. మేం ప్రతి అవకాశాన్ని ఆస్వాదించాం. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తాం’ అని పేర్కొన్నాడు.

ఓ వైపు ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు పొగుడుకుంటుంటే మరోవైపు వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు రోజురోజుకు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికాలో ఎలా ఆడతారు చూడాలి.

Also Read: Watch Video: పాక్, వెస్టిండీస్ మ్యాచులో ఫన్నీ సీన్.. అచ్చం వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్‌లాగే.. వైరలవుతోన్న వీడియో..!

Watch Video: సరదా.. సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!