Ind vs NZ 2nd ODI Rajkot : రాజ్‌కోట్‌లో రణం..సిరీస్ పట్టేసేందుకు భారత్ సై..పగ తీర్చుకునేందుకు కివీస్ రెడీ!

Ind vs NZ 2nd ODI Rajkot : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (జనవరి 14, 2026) రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరుగుతోంది. ఇప్పటికే మొదటి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

Ind vs NZ 2nd ODI Rajkot : రాజ్‌కోట్‌లో రణం..సిరీస్ పట్టేసేందుకు భారత్ సై..పగ తీర్చుకునేందుకు కివీస్ రెడీ!
Ind Vs Nz 2nd Odi Rajkot

Updated on: Jan 14, 2026 | 12:50 PM

Ind vs NZ 2nd ODI Rajkot : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (జనవరి 14, 2026) రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరుగుతోంది. ఇప్పటికే మొదటి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, రాజ్‌కోట్ మైదానంలో టీమ్ ఇండియాకు అంత మంచి రికార్డు లేకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి, మూడింటిలో ఓటమి పాలైంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. వెన్ను గాయంతో రిషబ్ పంత్ ఇప్పటికే సిరీస్ మొత్తానికి దూరం కాగా, ధ్రువ్ జురెల్ అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు. తాజా వార్త ఏమిటంటే.. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా పక్కటెముకల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బడోనీకి మొదటిసారి టీమ్ ఇండియాలో పిలుపు వచ్చింది. సుందర్ స్థానంలో బడోనీ లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాజ్‌కోట్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం వంటిది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ వన్డేల్లో సెకండ్ బ్యాటింగ్ (ఛేజింగ్) చేసిన జట్టు ఒక్కసారి కూడా గెలవలేదు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలక పాత్ర పోషించనుంది.

మొదటి వన్డేలో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 300 పరుగులు చేయగా, భారత్ 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (93 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో హర్షిత్ రాణా, కె.ఎల్ రాహుల్ జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ 84 పరుగులతో రాణించాడు. కివీస్ జట్టు సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.

న్యూజిలాండ్ స్క్వాడ్

మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), జాకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్సన్, మైఖేల్ రే, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్, జాడెన్ లెన్నాక్స్.

ఇండియా స్క్వాడ్

శుబ్మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, KL రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ఆయుష్ బడోని, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.