హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ ఇండియా న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు దగ్గరగా ఉంది. మంగళవారం నేపియర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో, చివరి టీ20 మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియాకు సిరీస్ దక్కనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి సిరీస్ గెలవాలని కోరుకుంటుంది. అయితే, టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.