Video: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ప్రోమో వచ్చేసింది! కోహ్లీ క్లిప్స్‌ అయితే హైలెట్‌..

జూన్ 20 నుంచి భారత క్రికెట్ జట్టు ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటిస్తోంది. సోని స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమోలో కోహ్లీ అగ్రెషన్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. రోహిత్ శర్మ ప్రస్తుత ఫామ్, కెప్టెన్సీ ఎంపిక (రోహిత్ లేదా బుమ్రా) జట్టు ఎంపిక ప్రధాన చర్చనీయాంశాలు.

Video: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ప్రోమో వచ్చేసింది! కోహ్లీ క్లిప్స్‌ అయితే హైలెట్‌..
Ind Vs Eng

Updated on: Apr 18, 2025 | 6:13 PM

జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం పర్యటించనుంది. ఐపీఎల్‌ తర్వాత టీమిండియా ఆడబోయే తొలి టెస్ట్‌ సిరీస్‌ ఇదే. జూన్‌ 20 నుంచి ఆగస్టుట 4 వరకు ఈ లాంగ్‌ సిరీస్‌ సాగనుంది. అయితే.. ఈ సిరీస్‌కు సంబంధించి సోని స్పోర్ట్స్‌ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో గతంలో భారత్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్ల మధ్య చోటు ఫైరీ సీన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అగ్రెసివ్‌ సీన్స్‌ ప్రోమోకే హైలెట్‌గా నిలుస్తున్నాయి.

కాగా, ఈ సిరీస్‌కు సంబంధించి త్వరలోనే భారత సెలెక్టర్లు స్క్వౌడ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మను ఆడిస్తారా? లేక ప్రస్తుతం అతని బ్యాడ్‌ ఫామ్‌ దృష్ట్యా రెస్ట్‌ ఇచ్చి, జస్ప్రీత్‌ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కానీ, ఇటీవలె బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి