Ind Vs Eng 1st Test: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మధ్య గొడవ జరిగిందా.? ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో వెలుపల వీరిద్దరూ గొడవ పడ్డారని చూపిస్తున్న ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలు దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం..
రెండో రోజు సెషన్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. వాళ్లకు అక్కడ ఉన్న కోచ్ రవిశాస్త్రి, మహమ్మద్ సిరాజ్ స్వాగతం పలికారు. అయితే వారి వెంట వచ్చిన డ్రింక్స్ బాయ్‌గా ఉన్న కుల్‌దీప్‌ను మాత్రం సిరాజ్ ఒక్కసారిగా మెడ పట్టుకుని ఏదో మాట్లాడాడు. దీనితో అతడు ఉలిక్కిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఇద్దరూ గొడవపడ్డారని కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం అది ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక పరిహసమని.. చాలాసార్లు దీన్ని చూసామని కామెంట్ చేశారు. కాగా, సిరాజ్, కుల్‌దీప్‌లకు మొదటి టెస్టు తుది జట్టులో చోటు దక్కలేని సంగతి తెలిసిందే.
Also Read:
ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక.. ఇవే లాస్ట్ డేట్‌లు.. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ బంద్.!
ఇకపై టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.! కొత్త నిబంధనలు సిద్దం చేస్తోన్న కేంద్రం..
What did siraj do here to kuldeep???#INDvsENG pic.twitter.com/pmWzVXAwt9
— VIRATIAN stan (@VIRATIANstan18) February 5, 2021