IND Vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్.. 354 పరుగుల భారీ ఆధిక్యం.. టీమిండియా నిలిచేనా..

|

Aug 27, 2021 | 4:07 PM

లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 432 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత్‌పై 354 పరుగుల..

IND Vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్.. 354 పరుగుల భారీ ఆధిక్యం.. టీమిండియా నిలిచేనా..
Follow us on

లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 432 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత్‌పై 354 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 423 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్.. మరో తొమ్మిది పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ జో రూట్(121) అద్భుత సెంచరీతో అదరగొట్టగా.. డేవిడ్ మాలన్(70), హమీద్(68), బర్న్స్(61) అర్ధ సెంచరీలతో దుమ్ముదులిపారు. ఇక ఓవర్టన్(32), బెయిర్‌స్టో(29) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, జడేజా, సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు.

ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 78 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి రెండో సెషన్‌లోనే కోహ్లీసేన చేతులెత్తేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు పేలవ ప్రదర్శనను కనబరిచారు. ఒకరి తర్వాత ఒకరు వెనువెంటనే పెవిలియన్ చేరారు. మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.

ముఖ్యంగా ఆండర్సన్ కీలక వికెట్లు పడగొట్టి.. టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్(0), పుజారా(1), విరాట్ కోహ్లీ(7)లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహనే(18), రోహిత్ శర్మ(19)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నా.. ఇంగ్లాండ్ పేసర్లు వారిని క్రీజులో కుదురుకోకుండా చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తప్పితే మరెవ్వరూ కూడా రెండంకెల స్కోర్ దాటలేకపోయారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్, ఓవర్టన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్, కర్రన్ రెండేసి వికెట్లు తీశారు.