india vs england 3rd odi match Highlights: భారత జట్టు మరోసారి సత్తాచాటింది. సొంతగడ్డపై కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కూడా వశం చేసుకొని రికార్డు సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి మ్యాచ్‌లో కోహ్లీ సేన అదరగొట్టి ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన అన్ని ఫార్మాట్ల సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసుకొని భారత్ దుమ్మురేపింది. పూణేలో జరిగిన ఆఖరి వన్డేలో 330 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మొదట్లోనే తడపడింది. ఆ తర్వాత రాణించినప్పటికీ.. చివరకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 50 ఓవర్లకు 322 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. బంతిని అందుకున్న నటరాజన్ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఛేదనలో ఇంగ్లాండ్ జట్టులో సామ్ కరన్ (83 బంతుల్లో 95 నాటౌట్) రాణించగా, డేవిడ్ మలన్ (50) అర్ధశతకం, బెన్‌స్టోక్స్ (35), లియామ్ లివింగ్‌స్టోన్ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివర్లో సామ్ కరన్ పోరాటం వృథా అయింది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో ప్రత్యర్థి జట్టును దెబ్బతీశారు.
అంతకు ముందు…టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీిమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్(67/56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పంత్(78/ 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్ పాండ్య(64/ 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) సూపర్ ఆటతీరుతో విరుచుకు పడ్డడారు. ఆరంభంలో రోహిత్ శర్మ(37), ఆఖర్లో శార్దుల్ ఠాకూర్(30) కీలక ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ముందు భారీ స్కోర్ పెట్టగలిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు వికెట్లు తీయగా..అదిల్ రసీద్ గూగ్లీలతో రెండు వికెట్లు తీశాడు.
అయితే టీమిండియాకు రోహిత్-ధావన్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. చరిత్రలో ఓ రికార్డ్ భాగస్వమ్యంను నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్, ధావన్, కోహ్లీ(7) పెవిలియన్ దారి పట్టారు. అయితే ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ తుఫాన్‌లాంటి ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. 157/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును పంత్, హార్దిక్ క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం సాధించిన తర్వాత పంత్ గేర్ మార్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న పంత్ జోరుకు 36వ ఓవర్‌లో శామ్ కరన్ రూపంలో బ్రేక్ పడింది.
ఆ తర్వాత హార్దిక్ వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 39వ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్‌లో హార్దిక్ ఔటవడంతో.. అప్పటికే జట్టు మంచి స్కోరుకు చేరుకుంది. చివర్లో కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకూర్(30) వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును 300 దాటించారు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కృనాల్ ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకే ఓవర్‌లో ఒకే ఓవర్‌లో మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడేశాడు. తొలుత రెండో బంతికి కృనాల్ పాండ్య(25) భారీ షాట్ ఆడగా జేసన్ రాయ్ అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు. తర్వాత చివరి బంతికి ప్రసిద్ధ్ కృష్ణ(0) బౌల్డ్‌య్యాడు. క్రీజులో భువనేశ్వర్(3) ఉన్నాడు.
అంతకు ముందు పుణెలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నాయి ఇరుజట్లు. ఈ మ్యాచ్ గెలవాలని నువ్వా.. నేనా అని పోరాడుతున్నాయి. గత మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. మరి విజయం ఎవరి సొంతమవుతుందో వేచి చూడాలి…
ఇంగ్లాండ్‌పై జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో దక్కించుకుంది.
చివరి ఓవర్ తొలిబంతికి రెండో పరుగు తీసే క్రమంలో మార్క్‌వుడ్ రనౌట్ అయ్యాడు.
భారత జట్టు వరుసగా రెండు క్యాచ్‌లను వదిలేసి.. మ్యాచ్ ముగించే అవకాశాన్ని కోల్పోయింది. హార్దిక్ 49 ఓవర్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ గెలవాలంటే.. ఇంగ్లాండ్ చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉంది.
48 ఓవర్లకు ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 311 చేసింది. భువీ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కరన్ (86), మార్క్ వుడ్ (13) క్రీజులో ఉన్నారు.
శార్దూల్ 18 పరుగులు ఇచ్చాడు. సామ్ కరన్ (85) రెండు బౌండరీలు చేశారు. ఒక సిక్సర్ బాదేశాడు. గెలుపు సమీకరణాన్ని 18 బంతుల్లో 23గా మార్చాడు. మార్క్‌వుడ్ (12) అతడికి తోడుగా ఉన్నాడు.
సామ్ కరణ్ క్లిష్ట పరిస్థితులలో ఒక వైపు నుండి తన పోరాటాన్ని కొనసాగించాడు. అర్ధ సెంచరీ సాధించాడు. కరణ్ తన మొదటి అర్ధ సెంచరీని కేవలం 45 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో పూర్తి చేశాడు.
కృష్ణ తొలి ఓవర్ బాగా పడింది. దీంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ ఈ ఓవర్లో ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఈ ఓవర్లో కృష్ణ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 38 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 253 పరుగులు చేసింది. ఇప్పుడు అతనికి 72 బంతుల్లో 77 పరుగులు మాత్రమే కావాలి. 3 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. కానీ కరణ్, రషీద్ జోడీ బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు.
భువీ బౌలింగ్‌లో మరో వికెట్ పడింది. భువీ 4 పరుగులిచ్చి కీలకమైన మొయిన్ అలీను ఔట్ చేశాడు. రషీద్ క్రీజులోకి వచ్చాడు. సామ్‌కరన్ (9) నిలకడగా ఆడుతున్నాడు.
డేవిడ్ మలన్ స్పీడ్‌కు శార్దూల్ ఠాకూర్ బ్రేకులు వేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడుతో ఉన్న మలన్ ఔట్ చేశాడు. మొయిన్ అలీ 8 పరుగులతో ఉన్నాడు. సామ్ కరన్ పరుగుల ఖాతా తెరవలేదు.
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్‌లో మూడో బంతికి లివింగ్ స్టన్(36) ఔటయ్యాడు. క్రీజులో మొయిన్ అలీ, డేవిడ్ మలన్ ఉన్నారు.
శార్దూల్ ఠాకూర్ మొదటి బంతికే బట్లర్ను ఎల్బీగా వెనక్కి పంపాడు.
టీమిండియా బౌలర్ల కూడా తిప్పేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్‌లో స్టోక్స్ ఒక బౌండరీ బాదాడు. చివరి బంతికి బెయిర్ స్టో(1)ను ఎల్బీగా వెనుదిరిగాడు. భువనేశ్వర్ తన ఖచ్చితమైన లైన్‌తో స్వింగ్ వేయడంతో ఎల్బిడబ్ల్యు అవుట్ అయ్యాడు. అంపైర్ నితిన్ మీనన్ మరో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
టీమిండియా 329 పరుగులకు ఆలౌటైంది. 48.2 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయింది. తుఫాన్‌లా మరోసారి పంత్(78) విరుచుకు పడ్డాడు. ఇక హార్దిక్ పాండ్య(64), శిఖర్ ధావన్(67) ధాటిగా ఆడి అర్ధశతకాలతో చెలరేగారు. టీమిండియా ఎనిమిది పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. టాప్లీ వేసిన 49వ ఓవర్‌లో భువనేశ్వర్(3) చివరి వికెట్‌గా వెనుతిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3, రషీద్ 2 వికెట్లు తీయగా.. కరన్, స్టోక్స్, టాప్టీ, అలీ, లివింగ్‌స్టన్ తలో వికెట్ తీశారు.
ఒకే ఓవర్‌లో మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడేశాడు. తొలుత రెండో బంతికి కృనాల్ పాండ్య(25) భారీ షాట్ ఆడగా జేసన్ రాయ్ అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు. తర్వాత చివరి బంతికి ప్రసిద్ధ్ కృష్ణ(0) బౌల్డ్‌య్యాడు.
శార్దూల్ ఠాకుర్ ఔటయ్యాడు. మార్క్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి కీపర్ చేతికి దొరికిపోయాడు. దీంతో టీమిండియా 321 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
హార్దిక్ పాండ్య(64) ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్ వేసిన 39వ ఓవర్ చివరి బంతికి బౌల్డయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 276 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మరోవైపు ఈ ఓవర్‌లో తొమ్మిది పరుగులొచ్చాయి.
రిషభ్ పంత్(78) ఔటయ్యాడు. సామ్‌కరన్ వేసిన 36వ ఓవర్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అత్యంత వేగంగా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు రాగా ఒక వికెట్ పడింది
రిషభ్ పంత్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అదిల్ రషీద్ వేసిన 31వ ఓవర్‌లో సిక్సర్ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు తీశాడు.
పంత్‌తో కలిసి పాండ్య దుమ్ము రేపుతున్నారు. కీలక వికెట్ల పడిన సంగతిని కూడా మరిచిపోయేలా దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొయిన్ అలీ బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తున్నారు. అలీ వేసిన ఓవర్‌లో హార్దిక్ పాండ్య(21) మూడు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. అలాగే మరో రెండు పరుగులు రావడంతో టీమిండియా ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు రాబట్టింది.
A steady 50-run partnership off 35 comes up between @RishabhPant17 & @hardikpandya7.
Live – https://t.co/wIhEfE5PDR #INDvENG @Paytm pic.twitter.com/gMJbpzMaj2
— BCCI (@BCCI) March 28, 2021
లివింగ్‌స్టన్ వేసిన 24.2 ఓవర్‌కు కేఎల్ రాహుల్(7) ఔటయ్యాడు. ఫుల్‌టాస్ బంతిని బ్యాక్‌వర్డ్ షార్ట్ లెగ్‌లో ఆడటంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మోయిన్ అలీ డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. దీంతో టీమిండియా 157 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో పంత్(31), హార్దిక్ పాండ్య(1) ఉన్నారు.
టీమిండియా మరో కీలక వికెట్ చేజార్చుకుంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. మొయిన్ అలీ వేసిన 17.4వ బంతిని ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
రషీద్ దాటికి టీమిండియా వికెట్ మరొకటి పడింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (67)ను ఔట్ చేశాడు. 16.4వ బంతిని రషీద్ గూగ్లీగా విసిరగా గబ్బర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Rashid strikes again!
He pouches an easy return catch from Dhawan, and India are 117/2!
It’s been a terrific spell so far from the England spinner ?#INDvENG ➡️ https://t.co/HvQMFer0ri pic.twitter.com/p3M5pLs4Jg
— ICC (@ICC) March 28, 2021
టీమిండియా తొలి వికెట్‌ను చేజార్చుకుంది. రోహిత్ శర్మ (37) ఔటయ్యాడు. రషీద్ వేసిన 14.4వ బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. గూగ్లీ రూపంలో వచ్చిన బంతిని హిట్‌మ్యాన్ డిఫెండ్ చేయబోయాడు. అతడి బ్యాటు, ప్యాడ్ల మధ్య నుంచి వెళ్లిన బంతి వికెట్లను తాకింది.
A wrong’un from Adil Rashid, and England have their first wicket as Rohit Sharma is bowled!
In comes Virat Kohli. #INDvENG ➡️ https://t.co/HvQMFer0ri pic.twitter.com/bHeyKLmyn8
— ICC (@ICC) March 28, 2021