
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి రోజు 2 వికెట్లు కోల్పోయి 276 పరుగులు సాధించింది. తొలి సెషన్‌లో 46/0తో నిలిచిన కోహ్లీసేన రెండో సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి మరో130పరుగులు చేసింది. మొత్తం 90 ఓవర్లకు 276 పరుగులు సాధించి పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ(83; 145 బంతుల్లో 11×4, 1×6) ఆకట్టుకున్నాడు. తొలిసారి లార్డ్స్ మైదానంలో ఆడుతున్న రోహిత్ మొదట్లో ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించాడు. ఈక్రమంలోనే తన 13వ అర్థ శతకం సాధించాడు. ఆతర్వాత అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (82 నాటౌట్; 178 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకం సాధించి సెంచరీతో కొనసాగుతున్నాడు. 212 బంతుల్లో 9×4, 1×6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న కేఎల్ రాహుల్.. లార్డ్స్‌లో టెస్టు సెంచరీ బాదిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ 276/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ (127 బ్యాటింగ్: 248 బంతుల్లో 12×4, 1×6), అజింక్య రహానె (1 బ్యాటింగ్: 22 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు.
మరోవైపు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా(9; 23 బంతుల్లో 1×4) మరోసారి నిరాశపరిచాడు. ఆ సమయంలో భారత్ 150 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా మరో వికెట్ పడకుండా భారత్ జాగ్రత్తగా ఆడింది. అయితే కోహ్లీ మాత్రం పరుగులు సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ఆతర్వాత 40పరుగులకు అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్‌కి ఒక వికెట్ దక్కింది.
మరిన్ని ఇక్కడ చదవండి :