India Vs England 2021: చివరి రెండు మ్యాచ్‌లకు భారత్ జట్టు ఇదే.. షమీకి నిరాశ, రాహుల్‌కు మరో అవకాశం..

|

Feb 17, 2021 | 10:29 PM

India Vs England 2021: రెండు టెస్టు విజయంతో ఊపు మీదున్న టీమిండియా.. మిగతా టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది...

India Vs England 2021: చివరి రెండు మ్యాచ్‌లకు భారత్ జట్టు ఇదే.. షమీకి నిరాశ, రాహుల్‌కు మరో అవకాశం..
Cricket India vs England
Follow us on

India Vs England 2021: రెండు టెస్టు విజయంతో ఊపు మీదున్న టీమిండియా.. మిగతా టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఫిట్‌నెస్ టెస్ట్ అనంతరం ఉమేష్ యాదవ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. అటు శార్దుల్ ఠాకూర్ జట్టులో చోటు కోల్పోయాడు. అహ్మదాబాద్‌లో జరగనున్న టెస్టు కోసం పేసర్ ఉమేష్ యాదవ్ జట్టు సభ్యులతో చేరనున్నాడని బీసీసీఐ వెల్లడించింది. గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ చివరి రెండు టెస్టులకు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని భావించినా.. అతడికి నిరాశే మిగిలింది. అటు నవదీప్ సైనీని సైతం సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం.

భారత్ జట్టు(చివరి రెండు టెస్టులకు): విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మాన్ గిల్, పుజారా, రహనే, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్

నెట్ బౌలర్లు: అంకిత్ రాజపూత్, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్

స్టాండ్‌బై ప్లేయర్స్: కెఎస్ భరత్, రాహుల్ చాహార్

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!