India Vs England: ముగిసిన నాలుగో రోజు ఆట.. టీమిండియా ముందు భారీ టార్గెట్.. గెలుపు సాధ్యమేనా.!

|

Feb 08, 2021 | 6:11 PM

India Vs England 1st Test Day 4: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రెండు రోజులు చెపాక్ పిచ్‌పై...

India Vs England: ముగిసిన నాలుగో రోజు ఆట.. టీమిండియా ముందు భారీ టార్గెట్.. గెలుపు సాధ్యమేనా.!

India Vs England 1st Test Day 4: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్(15), పుజారా(12) ఉన్నారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(12) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు.

అంతకముందు 241 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌ను.. అశ్విన్ బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా నిలువరించాడు. కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రూట్(40) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్  వివరాలు.. 

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్  వివరాలు.. 

అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, టీమిండియా ఫాలో ఆన్ గండం దాటాలంటే మరో 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ జట్టు ఆశలన్నీ కూడా క్రీజులో ఉన్న అశ్విన్, సుందర్‌పైనే ఉన్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Feb 2021 04:44 PM (IST)

    ముగిసిన నాలుగో రోజు ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యం..

    చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 381 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో గిల్(15), పుజారా(12) ఉన్నారు.

  • 08 Feb 2021 04:02 PM (IST)

    ఆలౌట్ అయిన ఇంగ్లాండ్.. భారత్ లక్ష్యం 420

    రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ దుమ్ములేపాడు. ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా నిలువరించాడు. కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.

  • 08 Feb 2021 03:46 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. రేసులో టీమిండియా..

    ఇంగ్లాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 167 పరుగుల వద్ద బెస్(25) అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. 43 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 167-8 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 03:44 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. నదీమ్ ఖాతాలో రెండు వికెట్లు..

    ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే లీడ్ మాత్రం భారీగా ఉంది. జట్టు స్కోర్ 165 పరుగుల వద్ద బట్లర్(24) నదీమ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. 42 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 167-7 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 03:32 PM (IST)

    400 దాటిన ఇంగ్లాండ్ ఆధిక్యం.. వికెట్ల వేటలో టీమిండియా..

    టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా ఇంగ్లాండ్ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు లీడ్ 400 దాటింది. క్రీజులో బట్లర్(23), బెస్(21) ఉన్నారు. ఇక 40 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 03:02 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… ఆధిక్యం 371..

    జోరు మీదున్న పొప్‌(28)కు టీమిండియా బౌలర్ నదీమ్ కళ్లెం వేశాడు. చక్కటి బంతితో షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 29 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 133-6 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 02:22 PM (IST)

    టీ బ్రేక్…. 27 ఓవర్లకు ఇంగ్లాండ్ 119/5

    రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. వరుస వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను కోలుకోని దెబ్బ తీశారు. ప్రస్తుతం టీ విరామానికి ఇంగ్లిష్ జట్టు 119/5 పరుగులు చేసింది. క్రీజ్‌లో పోప్(18), బట్లర్ (14) ఉన్నారు.

  • 08 Feb 2021 01:56 PM (IST)

    రూట్(40) ఔట్.. ఇంగ్లాండ్ ఆధిక్యం 342 పరుగులు..

    ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(40)ను పేసర్ బుమ్రా పెవిలియన్ పంపించాడు. టీమిండియాకు ఇది కీలక వికెట్ కావడంతో.. టార్గెట్ తగ్గే అవకాశం లేకపోలేదు. బుమ్రా వేసిన చక్కటి బంతిని మిస్ జడ్జ్ చేసిన రూట్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

  • 08 Feb 2021 01:28 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. అశ్విన్ ఖాతాలో మూడు వికెట్లు..

    సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ అశ్విన్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ టీంను కోలుకొని దెబ్బ తీశాడు. ఆల్ రౌండర్ స్టోక్స్(7)ను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. కానీ జో రూట్(27) ఇంకా క్రీజులోనే ఉండటం భారత్‌ను భయపెట్టే అంశం.

  • 08 Feb 2021 01:18 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. 300 దాటిన ఆధిక్యం..

    ఇంగ్లాండ్ ఆధిక్యం 300 దాటింది. కెప్టెన్ జో రూట్(26)మరోసారి తన టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జో రూట్(27), బెన్ స్టోక్స్(2) ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 66-3 చేసింది.

  • 08 Feb 2021 12:52 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. లారెన్స్(18) ఔట్..

    ఇంగ్లాండ్ జట్టు స్కోర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ దాటింది. ఈ తరుణంలోనే మూడో వికెట్‌ను కూడా కోల్పోయింది. లారెన్స్‌(18)ను ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో మూడు వందల వికెట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జో రూట్(21), బెన్ స్టోక్స్(0) ఉన్నారు.

  • 08 Feb 2021 12:49 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. ఆశ్విన్ మరో దెబ్బ..

    ఇంగ్లాండ్‌ను అశ్విన్ మరోసారి దెబ్బ కొట్టాడు. క్రీజులో స్థిరపడుతోన్న సిబ్లీ(16)ను చక్కటి బంతితో పెవిలియన్‌కు పంపించాడు. దీనితో 32 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లీష్ జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 12:41 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. 263 పరుగుల ఆధిక్యం..

    రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత పుంజుకుంది.. సిబ్లీ(12), లారెన్స్(12) మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 268 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లీష్ టీమ్ 27/1 చేసింది. క్రీజులో సిబ్లీ(12), లారెన్స్(12) ఉన్నారు.

  • 08 Feb 2021 11:35 AM (IST)

    రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్..

    టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించింది. అశ్విన్ వేసిన మొదటి ఓవర్‌ తొలి బంతికే బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్లిప్‌లో రహనే అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీనితో ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది.

  • 08 Feb 2021 11:11 AM (IST)

    టీమిండియా 337 ఆలౌట్..

    టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 96 ఓవర్లకు 337 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చివరి వికెట్‌గా బుమ్రా డకౌట్ కాగా.. ఆండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ ఫాలో-ఆన్ ఇవ్వలేదు. కొద్దిసేపటిలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించనుంది.

  • 08 Feb 2021 11:05 AM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆండర్సన్ బౌలింగ్‌లో ఇషాంత్ 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఆండర్సన్ వేసిన షర్ట్ పిచ్ బంతిని సరిగ్గా ఆడలేకపోయిన ఇషాంత్.. పొప్‌కు దొరికిపోయాడు. ఇక 94 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 323/9 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 10:46 AM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. లీచ్ బౌలింగ్‌లో నదీమ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సుందర్(64*) ఉండగా.. ఇషాంత్ శర్మ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇక 91 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 312/8 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 10:40 AM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఏడో వికెట్‌కు కీలకమైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లీచ్ బౌలింగ్‌లో అశ్విన్ బంతిని డిఫెండ్ చేయబోయి.. వికెట్ల వెనుక బట్లర్‌కు దొరికిపోయాడు. దీనితో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అశ్విన్ పెవిలియన్ బాట పడ్డాడు. ప్రస్తుతం 87 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 305/7 పరుగులు చేసింది. క్రీజులో సుందర్(58*), నదీమ్(0) ఉన్నారు.

  • 08 Feb 2021 10:21 AM (IST)

    టీమిండియా స్కోర్ 300 పరుగులు దాటేసింది…

    నాలుగో రోజు తొలి సెషన్‌లో సుందర్, అశ్విన్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ జట్టు స్కోర్‌ను 300 దాటించారు. ప్రస్తుతం 86 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 305/6 పరుగులు చేసింది. క్రీజులో సుందర్(58*), అశ్విన్(31*) ఉన్నారు.

  • 08 Feb 2021 10:18 AM (IST)

    అదరగొడుతున్న అశ్విన్, సుందర్.. వికెట్ల కోసం ఇంగ్లాండ్ బౌలర్ల ప్రయత్నం..

    నాలుగో రోజు తొలి సెషన్‌లో సుందర్, అశ్విన్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తూ.. అనవరమైన బంతులను వదిలేసి ఏడో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్ తనఅర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 85 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 298/6 పరుగులు చేసింది. క్రీజులో సుందర్(58*), అశ్విన్(30*) ఉన్నారు.

  • 08 Feb 2021 10:05 AM (IST)

    అర్ధ శతకం బాదిన వాషింగ్టన్ సుందర్

    ఇంగ్లాండ్ బౌలర్ జాక్ లీచ్ వేసిన ఓవర్ తొలి బంతికి సుందర్ ఫోర్ కొట్టి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కవర్ డ్రైవ్ మీదుగా బౌండరీ కొట్టి టీమిండియాను మళ్లీ గాడిలో పడేశాడు. 80 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది.

  • 08 Feb 2021 10:03 AM (IST)

    బెస్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్..

    అశ్విన్, సుందర్ దూకుడుగా నాలుగో రోజు ప్రారంభించారు. ఇంగ్లాండ్ బౌలర్ బెస్ బౌలింగ్ తొలి బంతికి సుందర్ ఫోర్ కొట్టగా.. చివరి బంతికి అశ్విన్ సిక్స్ బాదాడు. 77 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 273 పరుగులు చేసింది.

Follow us on