
IND vs AUS 1st ODI : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ అక్టోబర్ 19 న ప్రారంభం కాబోతోంది. ముందుగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌పై ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. సుమారు 8 నెలల తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? టీవీలో, మొబైల్‌లో లైవ్ ఎక్కడ చూడవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ అక్టోబర్ 19 న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ ఉదయం 8:30 గంటలకు పడుతుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 152 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌లు గెలిచి పైచేయి సాధించగా, భారత్ 58 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. అయితే, గత పది వన్డే మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుంటే భారత్ 6 సార్లు ఆస్ట్రేలియాను ఓడించడం విశేషం.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌ను టీవీలో చూడాలనుకునే ప్రేక్షకుల కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ ఈ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని అందించనున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్స్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
మొబైల్ ఫోన్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలనుకునే మొబైల్ యూజర్ల కోసం, ఈ మ్యాచ్‌ను జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంది.
తొలి వన్డేకు భారత్, ఆస్ట్రేలియా స్క్వాడ్
టీమిండియా జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (ఉప-కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
ఆస్ట్రేలియా జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనొలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, మాట్ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, మాథ్యూ కునేమన్, జోష్ ఫిలిప్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..