IND vs AFG: బ్యాట్ తో కోహ్లీ.. బౌలింగ్ లో భువీ విధ్వంసం.. విజయంతో టోర్నీ నుంచి తప్పుకున్న భారత్..

|

Sep 08, 2022 | 10:57 PM

IND Vs AFG T20: టోర్నమెంట్‌లో భారత్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, రెండు ఓటములతో తన ప్రయాణాన్ని ముగించింది.

IND vs AFG: బ్యాట్ తో కోహ్లీ.. బౌలింగ్ లో భువీ విధ్వంసం.. విజయంతో టోర్నీ నుంచి తప్పుకున్న భారత్..
Ind Vs Afg 2022
Follow us on

ఈసారి భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ నుంచి టైటిల్ గెలవకుండానే దేశానికి తిరిగి రానుంది. కానీ, భారత క్రికెట్ అభిమానులకు అవసరమైన రీతిలో జట్టు తన ప్రయాణాన్ని ముగించింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా.. తమ చివరి మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయం టీమ్ ఇండియాకు, దాని అభిమానులకు ఎంత ఉపశమనం, ఆనందాన్ని ఇచ్చిందనండంలో సందేహం లేదు. ఈ విజయంలో విరాట్ కోహ్లీ సెంచరీల కోసం కరువు, నిరీక్షణ ముగిసింది. భువనేశ్వర్ కుమార్ కూడా విధ్వంసం సృష్టించడంతో మరింత ఉపశమనం లభించింది.

వరుసగా నాలుగో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వరుస పరాజయాల తర్వాత బరిలోకి దిగింది. దుబాయ్‌లోని అదే మైదానంలో విరాట్ కోహ్లి చారిత్రాత్మక సెంచరీ, భువనేశ్వర్ కుమార్ విధ్వంసక బౌలింగ్‌తో సంచలన విజయం సాధించింది. ఈ విజయం ఆసియా కప్‌లో టీమ్ ఇండియా అదృష్టాన్ని మార్చకపోవచ్చు. కానీ, ఈ టోర్నమెంట్‌లోకి రాకముందు విపరీతమైన ఒత్తిడిలో ఉండి పరుగుల కోసం తీవ్రంగా కష్టపడుతున్న కోహ్లి అదృష్టాన్ని మార్చేసింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 71వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. దాదాపు 3 ఏళ్ల (1020 రోజులు) తర్వాత కింగ్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ. విరాట్‌ ఇన్నింగ్స్‌ ఆధారంగా భారత్‌ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ 62 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇబ్రహీం జద్రాన్ 62 పరుగులు చేశాడు. భారత్ తరపున భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ జట్టు కూడా విరాట్ కోహ్లి స్కోరు కంటే 11 పరుగులు వెనుకబడిపోయింది.

ఇరు జట్లు..

భారత్‌- కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, ఆర్ అశ్విన్

ఆఫ్ఘనిస్తాన్- హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం, ఇబ్రహీం కరీం జన్నత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మజీబ్ ఉర్ రెహ్మాన్, ఫరీద్ అహ్మద్, ఫజ్లాక్ ఫరూఖీ